Friday, November 22, 2024

ధర్మం – మర్మం : బుషి ప్రభోధం – సమాధి (ఆడియోతో)

సమాధి గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

పరమాత్మ యందు ప్రవర్తిస్తున్న మనస్సు యొక్క వృత్తి ప్రవాహము భగవంతుని కంటే వేరైన మరియొక విషయములందు ప్రసరించకుండా అన్ని విధాలుగా అన్ని సమయాలలో అన్ని స్థితులలో పరమాత్మ యందే నిలుపుట మరొక దానివైపు ప్రసరింపజేయకుండా భగవత్‌ తత్త్వము యందే ని లిపియుంచుట సమాధి అనబడును.

సమ్యక్‌ ఆధానం – చక్కగా ఉంచుట. ఎదురుగా పరమాత్మ రూపం కనపడుతున్నా మన మనస్సు మరో రూపాన్ని తలచినా, ఆలోచించినా సమాధి భంగమే. మరేచోటికి వెళ్ళకుండా, ఎటువంటి ఆలోచన రాకుండా ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని ఆ భగవంతుని యందే నిరంతరాయముగా ఉం చుటే సమాధి.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement