ధారణ గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
యధావిధిగా ప్రాణాయామమును ఎక్కువ సార్లు ఆచరించిన వారు మానసిక దోషాలను దహింప చేసుకుంటారు. మనస్సును లేదా బుద్ధిని, శుభములకు పరమాత్మ యందు నిలిపి ఉంచుట ‘ధారణ’ అనబడును. అలా కాకుండా మనస్సును, బుద్ధిని అశుభాలు, అమంగళాల పైన అపవిత్రుల పైన నిలపడం మారణం అంటారు. ఇలా పరమాత్మ యందు పరమ పవిత్రులైన గురువులందు మనస్సును నిలపినందు వల్ల పాపాలన్నీ తొలుగుతాయి. నిలుపకూడని దానిపై మనస్సుని నిలుపుటే పాపం కావున నిలుపవలసిన దానిపై మనస్సు నిలిపితే ఆ పాపం హరిస్తుంది. ఇలా ధారణతో పాపాలను తొలగించుకోవాలి.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి