Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : వాయువ్యం దిక్కుపై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

తూర్పు, ఆగ్నేయం, దక్షిణము, నైఋతి, పశ్చిమము, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యము అనే ఎనిమిది దిక్కుల అధిపతులను అష్టదిక్పాలకులుగా వ్యవహరిస్తారు.

వీరిలో వాయువ్యం దిక్కు అధిపతిని గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వి వరణ
పశ్చిమ ఉత్తర మధ్యభాగమైన వాయువ్యానికి అధిపతి వాయువు. ప్రకృతిలో జరిగే ప్రతి క్రియకీ వాయువే కారణం. మబ్బులు పుట్టాలన్నా, మబ్బులో నీరు నిండాలన్నా, నిండిన నీరు భూమి మీద కురవాలన్నా, కురిసిన నీరు ఇంకిపోవాలన్నా, దూరంగా ప్రవహించాలన్నా వాయువే ఆధారము. సకల జీవరాశులు జీవించేది వాయువు ఆధారంగానే. శరీరంలోకి వాయువు ప్రవేశిస్తే పుట్టుట, వాయువు నిష్క్రమిస్తే మరణించుట. సమాన వాయువు, ఉదాన వాయువు, వ్యాన వాయువు, నాగ వాయువు, కూర్మవాయువు, కృకర వాయువు, దేవదత్త వాయువు, ధనంజయ వాయువు, సూతికావాయువు, అపాన వాయువు అనునవి దశ ప్రాణవాయువులు. ఆహారం జీర్ణం కావాల న్నా జటరాగ్నిని వాయువే ఉద్దీపింపచేయాలి, కావున జీర్ణకోశంలో నాల్గో భాగాన్ని వాయువుకి కేటాయించాలి. మాట్లాడాలన్నా, వినాలన్నా, వాసన చూడాల న్నా, మనం చేసే ప్రతీ క్రియ వాయువు కారణంగానే. వేగానికి, బలానికి కొలత వాయువే కావున వాయువేగం, వాయుబలం అని వ్యవహారం. ఇలా మొత్తం ప్రపంచ జీవనభారం, నిర్వాహణ భారం తన భుజాలపై వేసుకొని సృష్టిని, రక్షణను, సంహారాన్ని కొనసాగిస్తున్నవాడు వాయువే కావున సకల దేవతా ప్రతిరూపముగా భారతీయులు వాయువును పూజిస్తారు.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement