తూర్పు, ఆగ్నేయం, దక్షిణము, నైఋతి, పశ్చిమము, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యము అనే ఎనిమిది దిక్కుల అధిపతులను అష్టదిక్పాలకులుగా వ్యవహరిస్తారు.
వీరిలో ఆగ్నేయం దిక్కు అధిపతిని గూర్చి శ్రీమాన్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ
తూర్పు దక్షిణ మధ్యభాగం ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడు. అగ్నిహోత్రుడు సర్వాంతర్యామి. ఉదరంలోని ఆహారపానీయాలను జీర్ణం చేసి దాని సారాన్ని శరీరమంతా అందిస్తాడు. కంటిలో ఉండి రూపాన్ని, నోటిలో ఉండి మాటను పలికిస్తాడు. యజ్ఞయాగాదులలో భక్తులు, యజమానులు సమర్పించిన కానుకలను ఆయా దేవతలకు అందించేవాడు అగ్నిహోత్రుడే. అన్ని వస్తువులను మనకు కావాల్సిన ఆకారంలో మలిచేది, అవసరం లేనివాటిని దహించేది అగ్నే. శాస్త్రోక్తంగా ఉపయోగించుకుంటే వెలుగునిస్తుంది శాస్త్ర విధిని తప్పితే దహించివేస్తుంది. అగ్నిహోత్రుని ఆరాధించువారు అన్ని ఉత్తమ ఫలితాలను పొందుతారు.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి