Sunday, November 10, 2024

ధర్మం – మర్మం : తూర్పు దిక్కు గురించి శ్రీమాన్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

తూర్పు, ఆగ్నేయం, దక్షిణము, నైఋతి, పశ్చిమము, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యము అనే ఎనిమిది దిక్కుల అధిపతులను అష్టదిక్పాలకులుగా వ్యవహరిస్తారు

వీరిలో తూర్పు దిక్కు అధిపతిని గూర్చి శ్రీమాన్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ
తూర్పుకు అధిపతి ఇంద్రుడు అదితికశ్యపుల పుత్రడు. ఇంద్రుడు త్రిలోకాధిపతియే కాక వర్షాధిపతి కూడా. ఇంద్రుడిని పూజిస్తే చక్కని వానలు పడతాయి. ఇతను మనస్సుకు అధిపతి. అందుకే ఎవరూ తపస్సు చేసినా విఘ్నాన్ని కలిగించి వారి మనోబలాన్ని పరీక్షిస్తాడు. మనస్సు లక్ష్యం మీద ఉంటే ఎవరి గురించి తపస్సు చేస్తున్నారో వారి వద్దకు వెళ్ళి వారి కోరికను తీర్చమని ప్రార్థిస్తాడు. రాక్షసులు దుష్టకార్యములు చేసినపుడు వారిని వధించి మూడు లోకాలను రక్షిస్తాడు. తన వల్ల కాకుంటే శ్రీమన్నారాయణునిని ప్రార్థించి అతనిని అవ తరింపజేసి అతని ద్వారా రక్షిస్తాడు. ఋషులు, మునులు, రాజులు వారందరిని పరీక్షించి గొప్పవారైతే ఆశ్రయించి, చిన్నవారైతే అభినందించి తన పాలనను సాగించినవాడు ఇంద్రుడు. దీపావళి తదుపరి కార్తీకమాసారంభంలో ఇంద్రధ్వజం పెట్టి 16 రోజులు ఇంద్రుడిని ఆరాధిస్తారు. భగవంతుడు అవతరించినపుడు అతనికి సేవ చేయడానికి, సహాయపడడానికి ఇంద్రుడు కూడా అవతరిస్తాడు. రామావతారంలో వాలిగా, కృష్ణావతారంలో అర్జునునిగా అవతరించి భగవంతుని సహాయం పొందెను.
తూర్పు దిక్కున ఉన్న మేరు పర్వతం నుండి సూర్యుడు తన వెలుగును ప్రసరించును. దీన్ని భూమికి మేడీ స్థంభం (మధ్యభాగాన ఉన్న) అని అందురు. సూర్యభగవానుడు ఉదయించు ప్రాంతం కావున ఉదయాచలం అని కూడా వ్యవహరిస్తారు.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement