Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం :

గౌతమీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

గౌతమీ వైభవం గూర్చి బ్రహ్మ నారదునికి ఈ విధంగా వివరించెను.

పంచానామపి భూతానాం అప: శ్రేష్ఠత్వ మాగతా:
తతాల పీతీర్ధ భూతాస్తు తస్మాదాప పరాస్స్మృతా:
తాసాం భాగీరధీ శ్రేష్ఠా తాభ్యోయాగౌతమీత్వయా
ఆనతా సజటా గంగా అస్యానాన్య చ్చుభావహో
స్వర్గే భువితవేవాపి తీర్థం సర్వార్ధదం మునౌ

తాత్పర్యము :
పంచభూతములలో జలములు శ్రేష్ఠములు. ఆ జలములలోను తీర్థభూతములైనా జలములు అత్యంత శ్రేష్టములు. ఆ తీర్థములు కంటే భాగీరధీ శ్రేష్ఠమైనది. భాగీరధీ కంటే గౌతమీ శ్రేష్ఠమైనది. గౌతమి నదిని నా(శంకరుడు) జటతో పాటు తీసుకొనివచ్చితివి, కావున దీని కం టే శుభకరమైనది మరొకటి లేదు. స్వర్గమున కాని భూలోకమున కాని పాతాళమున కాని గౌతమి తీర్థము సర్వార్ధప్రదము అని శంకరుడు గౌతమ మహర్షికి చెప్పెను. ఈ రీతిలో గౌతమీగంగ సకల తీర్థముల కంటే శ్రేష్ఠమైనది.

- Advertisement -

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement