Saturday, November 23, 2024

ధర్మం – మర్మం :

గంగానది మూడు లోకములకు చేరిన విధానం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

పరిశుద్ధుడైన గౌతమ మహర్షి ఏకాగ్ర మైన మనస్సుతో దేవతలచే, గంధర్వులచే పూజింపబడుతూ బ్రహ్మగిరి శిఖరము పై జటను ఉంచి త్రినేత్రుడిని స్మరించుచూ చేతులు జోడించి శంకరుని జటల నుండి ఉద్భవించిన గంగాదేవీ సకలకామనలను ప్రసాదించు గాన తల్లిd! నన్ను క్షమించి శాంతమూర్తిగా సుఖముగా ప్రవహించి హితమును చేయమని గంను ప్రార్థించెను. దివ్యరూపమును ధరించిన గంగాదేవీ పుష్పమాలలను, గంధములను ధరించి నీవు సత్యవాక్కు కలవాడివి గాన తాను దేవనివాసమునకు లేదా బ్రహ్మ కమండలమునకు లేదా రసాతలమునకైనా వెళ్ళదెనని గౌతమునితో పలికెను. గౌతముడు తాను మూడు లోకలముల హితముల కొరకు ప్రార్థించితినని శంకర భగవానుడు కూడా అదేవిధముగా ప్రసాదించెను కాన అది మరొక తీరుగా కారాదు అని ప్రార్థించగా బ్రాహ్మణ వాక్యమును తలచి తనని తాను మూడు పాయలుగా చేసుకొని స్వర్గ, మర్త్య, రసాతలములకు గంగ వెళ్లెను. గంగ స్వర్గమున నాలుగు పాయలుగా, మానవ లోకమున ఏడు పాయలుగా, రసాతలమున నాలుగు పాయలుగా ప్రవహించెను. ఈవిధంగా గంగానది తనని తాను 15 ఆకృతులుగా విభజించుకొని మూడు లోకములలో ప్రవహిస్తూ సకల పాపములను నశింప చేసి సకల కామనలను అనుగ్రహించెను.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement