Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం :

గంగా జలం మర్త్యలోకం చేరు విధానంలో భాగంగా గౌతముడు గంగా- పార్వతులను స్తుతించు విధానం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ఈ భూమి జగన్మాత మరియు జగత్తును సృష్టించున ది. సోమునికి ప్రియురాలు, మహా సుకీర్తి ఈమే. ఆ భూమి జలము నుండి పుట్టినది కావున ఆ గంగ సకల జగత్తును బ్రతికించుచున్నది. ఆ జలమునకు సరి అయినది మరేదీ లేదు. ఆ భూమి జలముతో స్పృశించబడితే అన్ని లోకాలు అన్నమయాలు, మనోమయాలు, ప్రాణమయాలు అవుతాయి. గంగ చేత చూడబడిన దాన్ని ఇంద్రుడు కూడ కోరతాడు. గంగా నామముతో శుభమును పొందుతారు. ఆ గంగే సోమ రూపురాలు కావున గంగను ‘సోమ’అందురు. ఈ గంగ సకల ప్రపంచమును పవిత్రం చేయును. అందుకే సకల జీవులు, చరాచరములు విభజించబడిన విశ్వమునకు, బుద్ధి, నేత్రము, చైతన్యము, మనస్సు, సుఖము సోమసమానరూప బ్రహ్మ కమండలం నుండి జాలువారిన గంగా ప్రసాదంతో సఫలమవుతాయి.

శ్రీమాన్‌ డాక్ట ర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement