పాపి చిరాయువు అనడంలో ఆంతర ్యం గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
కలి దోషం తీసుకొని వెళతాడు అంటే మంచివారిని త్వరగా ఎక్కువ కాలం సంసార దు:ఖాలు అనుభవించకుండా త్వరగా తన వద్దకు తీసుకొని వెళ్తాడు అని అర్థం. అంటే ముక్తిని ప్రసాది స్తారు అని అర్థం. మంచివారైనా చెడ్డవారైనా బ్రతికి సంసారంలో ఉన్నారంటే పూర్వజన్మ కర్మానుభవము కొరకే ఉంటారు. కర్మ శేషం ఉన్నంత వరకుండాలి. ఇప్పుడు మంచి వారైనా ఇది వరకు జన్మలలో చేసిన కర్మఫలం అనుభవించాలని బ్రతికి ఉంటారు. ”పాపి చిరాయు: సుకృతీగతాయు: ” అని ధర్మశాస్త్రము. చాలా మంచి వారుగా పేరొందిన వారు జీవితంలో ఎన్నో కష్టాలు పడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. కష్టాలు, కలతలు వస్తున్నాయంటే పాప ఫలితం అనుభవిస్తున్నామని అర్థం. అలాగే కష్టాలలో, బాధలలో భగవంతుడిని తలవక మానరు. ఆ కష్టాలు తీరే వరకు పూజలు, పునస్కారాలు, వ్రతాలు, తీర్థవ్రతాలు, తీర్థయాత్రలు వంటి పుణ్య కార్యాలను చేస్తూనే ఉంటారు. పుణ్యం కోసం, గత జన్మలో చేసిన పాపాలు పోవటానికి అంటే వచ్చే జన్మలో కూడా కష్టాలు రాకుండా ఉండటానికని పూజలు పునస్కారాలు చేస్తున్నామని అర్థం. అర్థాంతరంగా పోయినవారు కొత్తగా పోగొట్టుకోవాల్సిన పాపమేమీ లేదు, సంపాదించుకోవాల్సిన పుణ్యమూ లేదు. అనగా పుణ్యమున్న వారే త్వరగా మరణిస్తున్నారని అర్థము. పెద్దలు చెప్పే మాటలు లోతుగా ఉండి మన వంటి వారికి అంత త్వరగా అర్థం కావు. పూర్వ జన్మములో పుణ్యము చేసిన వారు త్వరగా మరణిస్తారని పాపం చె సిన వారు ఎక్కువ కాలం బ్రతుకుతారని అర్థము.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి