Wednesday, January 15, 2025

ధర్మం – మర్మం : కనుమ పండుగ (ఆడియోతో…)

కనుము రోజున పాటించాల్సిన నియమాల గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
భారతీయ సాంప్రదాయంలో ప్రతీ పండుగ మరుసటి రోజు వేడుక కనుము. ప్రతీ పండుగకు అభ్యంగన స్నానం, నూతన వస్త్ర ధారణ, దైవారాధన, బ్రాహ్మణులతో, బంధువులతో కలసి భుజించుటు, లేనివారికి అన్నదానం చేయుట, ఈ ఐదు పంచభూతాలకు మనం చేసే ఆరాధన. కనుము అనగా చూడుము, కలుపుము, తెలుపుము, తెలియుము, విడువుము అన్న ఐదు అర్థాలు ఉన్నాయి. ఈ రోజున పండుగ నాడు చేసిన పనులను ఒక్కసారి సింహావలోకనం(తలుచుకోవడం) చేసుకోవాలి. పండుగ నాడు మరిచిపోయిన వేడుకలను కనుము నాడు జరుపుకోవాలి. సామాన్యంగా ప్రతీ కనుమ నాడు నోములు నోచుకోవడం పరిపాటి. సంక్రాంతి కనుము నాడు గోదమ్మ నోము, కార్తిక కనుము నాడు గౌరమ్మ నోము, దసరా కనుము నాడు దుర్గమ్మ నోము, శ్రీరామనవమి కనుము నాడు సీతమ్మ నోము, ఇలా ఆయా అమ్మల పేరు మీద 10 మందిని పిలిచి భోజనాలు, వస్త్రాలు, వాయనాలు ఇచ్చి దీవెనెలు పొందాలి. స్వార్థం నశించడం, త్యాగం అల వడటం, మనకు ఉన్నది పది మందితో పంచుకోవడం ప్రతీ పండుగ ముఖ్యోద్ధేశ్యం.

శ్రీమాన్‌ డాక్ట ర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement