Monday, January 6, 2025

ధర్మం – మర్మం : భక్తి (ఆడియోతో…)

పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కం దాడై రామానుజాచార్యుల వారి వివరణ…
5

యేషాం చిత్తే వసేత్‌ భక్తి: సర్వదా ప్రేమ రూపిణి
నతే పశ్యంతి కీనాశం స్వప్నే ప్యమలమూర్తయ:

పరమాత్మ యందు ప్రేమ రూపమైన భక్తి మనసులో ఉన్నవారు పరిశుద్ధమైన, పవిత్రమైన శరీరము, వాక్కు కలవారు కలలో కూడా యమధర్మరాజును చూడ రు అంటే నరకానికి వెళ్లరు. భగవంతుడిని పరిశుద్ధమైన పవిత్రమైన ప్రయోజనాన్ని ఆశించని ప్రేమ రూపమైన భక్తితో ఆరాధించాలి. భగవం తుడిని భయంతో ఆరాధిం చరాదు. పూజ చేయకుంటే, దీపం పెట్టకుంటే ఏమి అవుతుందో, మొక్కు తీర్చకుంటే ఏమి జరుగుతుందో అన్న భయంతో చేసేవారే ఎక్కువయ్యారు. భగవంతుడు మనకు శత్రువు కాదు. పరమాత్మ అంటేనే ప్రేమ మూర్తి, దయామూర్తి, నమ్మదగిన మిత్రుడు. హితమును, ప్రియమును అందించేవాడని తెలుసుకొని ఆ భగవంతుడిని, నావాడు నాకు కావలసిన వాడు అని ప్రేమతో ఆరాధించాలి. భగవంతునిపై ప్రేమనే భక్తి అంటారు. ఇలా పరమాత్మను ప్రేమతో ఆరాధించిన వారు కలలో కూడా యముడిని చూడరని ఋషి
హృదయం

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement