Tuesday, November 26, 2024

పోరాడితేనే ధర్మం గెలిచేది!

అందరూ అంటుంటారు ”ధర్మమే గెలుస్తుంది” అని. అది తప్పు. ధర్మం దానంతట అదే గెలవదు. నువ్వు గెలిపించాలి, మనం కలిసి గెలిపించాలి. ఒక్కసారి నెత్తుటితో తడిసిన చరిత్ర పుస్తకాల్లోకి వెళితే-
ధర్మాన్ని, సత్యాన్ని స్థాపించడానికి భగ వంతుడు ఎన్నో రూపాలు ధరించి కష్టాలు పడుతుంటాడు.
కృత యుగంలో తన భక్తుడైన ప్రహ్లాదుడి ని కాపాడడానికి, ధర్మ సంస్థాపనకు భక్తుడి కోసం, భగవంతుడు ఉన్నాడు అని చెప్ప డం కోసం, సత్యాన్ని స్థాపించడం కోసం భగవంతుడు నృసింహ రూపంలో వ్యాపిం చి అహోబిల క్షేత్రంలో ఒక స్తంభం నుండి వచ్చాడు. హరణ్యకశ్యపుడిని సంహరించాడు.
‘త్రేతాయుగంలో’ రాముడి భార్య సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు, ”ధర్మమే గెలుస్తుం ది కదా, తన సీత తిరిగి వస్తుంది” అని రాముడు చేతులు కట్టుకొని గుమ్మంవైపు చూస్తూ కూ ర్చో లేదు. రావణాసురుడి మీద ధర్మయు ద్ధం ప్రకటించాడు. శ్రీరామునికి అఖండ వానర సైన్యం తోడై ధర్మం వైపుకు అడు గులు వేశారు, ఆ యుద్ధంలో శ్రీ రామునికి సైతం గాయాలయ్యాయి. తన భుజాలను, తొడ భాగాల చర్మాన్ని బాణాలు చీల్చుకొని వెళ్ళా యి. నరాలు తెగి రక్తం చిందుతున్నప్ప టికీ తట్టుకొని నిలబడ్డాడు, పోరాడాడు. యుద్ధం లో గెలిచాడు. ధర్మం గెలిచింది.
‘ద్వాపరయగంలో’ కురుక్షేత్రం యుద్ధంలో శ్రీకృష్ణుడు తను దేవుడిని కదా అని ఒక ప్రేక్షకుడిలా యుద్ధాన్ని చూడలేదు. పాండవుల పక్షాన నిలుచున్నాడు.
అర్జునుడికి రథసారధిగా మారాడు, గుర్రానికి గుగ్గిళ్లు పెట్టాడు, అబద్ధం ఆడాడు, చివరకు మోసం కూడా చేసాడు. అవన్ని ధర్మం కోసమే చేసాడు. ధర్మాన్ని గెలిపించడం కోసమే చేసాడు. అలా కురుక్షేత్ర యుద్ధం ముగిసింది, ధర్మం గెలిచింది.
‘కలియుగం’ ఇప్పుడు కూడా మనం ప్రతిరోజు సమస్యలతో పోరాడుతూనే వున్నాం. ప్రతి ఒక్కరి మదిలో మంచికి చెడుకి మధ్య యుద్ధం జరుగుతూనే వుంది. నువ్వు నమ్మితే అది నిజం మాత్రమే అవుతుంది. అదే నువ్వు నా, నీ, తన, మన భేదాలను పక్క న పెట్టి న్యాయం గురించి ఆలోచిస్తేనే ధర్మం అర్థం అవుతుంది.అలా ఆలోచించి పోరాడిన రోజే ధర్మం గెలుస్తుంది. ధర్మం వైపు నిలబడిన రోజు నీ వెనుక ప్రపంచమే నడుస్తుంది.

  • కైలాష్‌ నాగేష్‌
Advertisement

తాజా వార్తలు

Advertisement