పార్వతీపరమేశ్వరుల పాణిగ్రహణంలో గంగా ఆవిర్భావం గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ
మహాదేవుడు అభిమంత్రించిన జలముతో ఉన్న కమండలమును బ్రహ్మకు అందిస్తూ ఈ విధంగా పలికెను.
అత్ర పతిష్ఠితో ధర్మ: అత్ర యజ్ఞ సనాతన:
అత్ర ముక్తిశ్చ భుక్తిశ్చ స్థావరం జంగమంచయత్ ||
స్మరణాత్ మానసం పాపం వచనాత్ వాచికం తధా
వందనాత్ సర్వపాపాని స్నానపాన అభిషేకత: ||
వినశ్యేత్ కాయికం పాపం ఏతదేవా మృతమ్ లోకే
నైతస్మాత్ పావనం పర మ్ మయాభి మంత్రితం బ్రహ్మన్
గృహాణమం కమండలుమ్
(ఈ మూడు శ్లోకాలను ప్రతి దినం ప్రాత: కాలమున చదివిన వారికి గంగాస్నాన ఫలం లభించును. )
ఈ జలములోనే (గంగ) ధర్మము, సనాత యజ్ఞము ప్రతిష్టించబడినవి. భుక్తి, ముక్తి, సకల స్థావర జంగమములు ఈ జలములోనే ప్రతిష్టించబడినవి. స్మరించుట వలన మానసిక పాపం, పలుకుట వలన వాచక పాపం, నమస్కారము, స్నాన, పాన, అభిషేకముల వలన కాయిక (దేహం) పాపం నశిస్తాయి. అన్ని లోకములకు ఈ జలమే అమృతము, పావనము. తాను(శివుడు) స్వయంగా అభిమంత్రించి ఇచ్చిన ఈ కమండలమును స్వీకరించుము అని పై శ్లోకాలర్థం.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి