Saturday, November 23, 2024

ధ‌ర్మం మ‌ర్మం (ఆడియోతో..)

పార్వతీపరమేశ్వరుల పాణిగ్రహణంలో గంగా ఆవిర్భావం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

మహాదేవుడు అభిమంత్రించిన జలముతో ఉన్న కమండలమును బ్రహ్మకు అందిస్తూ ఈ విధంగా పలికెను.

అత్రత్యం వారియ: కశ్చిత్‌ స్మరేదపి పిబేదపి
ససర్వకామానాప్నోతి గృహాణమం కమండలుం

భూతేభ్యశ్చాభి పంచభ్య: ఆపోభూతం మహోదయం
తాసాముత్కృష్టం యేతస్మాత్‌ గృహాణమం కమండలుం

అత్రయద్వారి శోభిష్టం పుణ ్యం పావన మేవచ
స్పృష్ట్వా స్మృత్వాచ దృష్ట్వాచ బ్ర హ్మన్‌ పాపాద్విమోక్షసే

- Advertisement -

ఈ కమండలములోని జలమును అనగా గంగను స్మరించినా, పానము చేసినా అన్ని కోరికలు తీరును కావున ఈ కమండలమును స్వీకరించుము. పంచభూతములలో జలభూతము చాలా గొప్పది అందున తాను(శివుడు) సృష్టించిన ఈ గంగ ఇంకా గొప్పది కావున ఈ కమండలమును తీసుకో దీనిలో ఉన్న శోభనమైన జలము పుణ్యము, పావనము ఈ జలమును తాకినా, తలచినా, చూచినా అన్ని పాపములు నశించును అని పై శ్లోకాల అర్థం.

ఈ విధంగా మహాదేవుడు బ్రహ్మకు కమండలమును ఇవ్వగా చూసిన దేవతలందరూ సంతోషించి జయ జయ ధ్వానాలు చేసిరి. ఈ విధంగా పరమేశ్వరుని కళ్యాణంలో జగన్మాత పాదాలను చూసి పాపబుద్ధితో పతితుడయిన తనను పవిత్రుడిని చేయుటకు త్రిలోకపావనమైన కమండలములోని గంగా జలమును మహాదేవుడు ప్రసాదించెనని ఈ జలము తననే గాక అన్ని లోకాలను పావనం చేస్తుందని బ్రహ్మ సంతసించెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement