పూజించాల్సిన వృక్షాలు – వితరణ ఫలాల గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
అశ్వత్ధ ఏకం పిచుమన్ద ఏక: న్యగ్రోధ ఏక:
దశతింత్రిణీ చ కపిత్ధ బల్వామల అలర్క:
జేదుంబర: తులసీ ప్లక్షరూతోప:
పలాశ వృక్షా పరిపూజనీయా:
అనునది ధర్మశాస్త్రము. రావి, వేప, మర్రి, చింత, వెలగ, మారేడు, ఉసిరి, జిల్లేడు, మేడి, తులసి, జువ్వి, మోదుగ ఈ ద్వాదశ వృక్షములు దేవతా వృక్షములు. మల్లె, మొల్ల, విరజాజి, సన్నజాజి, మొగలి, సంపెంగ, కమలాలు, కలువలు, వాసన ఉన్న పూలు, కొరక, వీరక, పూరక ఈ పన్నెండు రకాల పూల చెట్ల పూలతో దైవాన్ని పూజించాలి.
ఉత్తరేణి, విష్ణు క్రాంత, అశ్వగంధ, మాద్వీ, యవనాచి, దిలీప, చక్రవాక, ఇక్షుమతో వంటి ఔషధములకు వాడే వృక్షములను పూజించాలి. ఇక మామిడి, అరటి, జామ, దానిమ్మ, మాదీ ఫలము, బదరీ, సపోట, బత్తాయి, నారింజ, నారికేల ఫలము పత్రము వృక్షము, ద్రాక్ష, ఖర్జూర, తిందుకు, ఇందుక ఇతర మధుర ఫలములను పూజించాలి దానము చేయాలి. తులసి, ఉసిరి, దానిమ్మ, బిల్వ, వేప మొక్కలు ఈ అయిదు మొక్కలను పూజించి సద్బ్రాహ్మణునకు దానము చేస్తే విశేష ఫలము లభిస్తుంది. ఫలమును ఎవరికైనా అనగా అవసరమున్న వారికి ఈయవచ్చును. ఫలదానం, అంకుర దానం, పుష్పదానం, పాపపరిహారార్థమైతే వేదవేందాగ పండితునకీయాలి.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి