యోహి భాగవతో భూత్వా కలౌ తులసి చందనమ్ |
నర్పయోద్వై సహో మాసే నాసౌ భాగవతో నర: ||
కుంకుమాగురు శ్రీఖండ కర్దమైర్మమ విగ్రహమ్ |
ఆలేపే ద్వై సహామాసే కల్పకోటిం వసేద్దివి ||
కర్పూరాగురు మిశ్రేణ చందనేనానులింపయేత్ |
మృగదర్పం విశేషేణ అభీష్టంచ సదా మమ ||
విలేపయతి యో మాం వై ంఖే కృత్వాతు చందనమ్ |
మర్గశీర్షే తదా ప్రీతిం కరోమి శతవార్షికీమ్ ||
సేవతే తులసీ పత్రై: నిత్యమామలకైశ్చయ: |
మార్గశీర్షే సదా భక్త్యాసలభేద్వాంఛితం ఫలమ్ ||
భగవతోత్తముడైన కలియుగమున తులసీ చందనమును మార్గశీర్ష మాసమున అర్పించనివాడు భాగవతుడు కాదు. కర్పూరాగరు కుంకుమ శ్రీఖండములతో నా విగ్రహమును మార్గశీర్షమాసమున ఆ లేపనము చేసినచో అతను స్వర్గమున కోటి కల్పములు నివసించును. కర్పూరాగరు మిశ్రమమైన చందనముతో ఆలేపనమును విశేషించి కస్తూరి నాకు సదా అభీష్టము శంఖమున వేసి చందనమును నాకు లేపనము చేసినచో అదీ మార్గశీర్ష మాసమున అయినచో నూరు సంవత్సరములు ప్రీతి కలిగి యుందును. మార్గశీర్షమాసమున తులసీపత్రములతో ఆమలకములతో నన్ను సేవించినచో అతను కోరిన ఫలమును లభించును.
డా|| కందాడై రామానుజాచార్య ఎమ్.ఎ., పి.హెచ్‌డి.