Wednesday, November 20, 2024

ధ‌ర్మం మ‌ర్మం – మార్గశిరమాస విశిష్టత

పుష్పైరణ్య సంభూతై పత్రైర్వాగిరి సంభవై: |
అపర్యుషిత నిశ్ఛిద్రై: పోక్షితైర్జతువర్జితై: ||

అధారామోద్భవైర్వాపి పుష్పై: సంపూజయేచ్చమామ్‌ |
పుష్పజాతి విశేషణ భవేత్పుణ్యం విశేషత: ||

తపశ్శీల గుణోపేతే పాత్రే వేదస్యపారగే |
దశదత్త్వా సువర్ణాని యత్ఫలం లభతే సర: |
తత్ఫలం లభతే మర్త్య: సహే కుసుమదానత: ||

ద్రోణపుష్పే తధేకస్మిన్‌ మహ్యం చ వినివేదితే |
దశదత్త్వా సువార్ణాని ఫలం తదధికం సుత ||

- Advertisement -

పుష్పాత్పుష్పాంతరే భేద: యదాసీత్తన్ని బోధమే |

ద్రోణ పుష్ప సహస్రేభ్య: ఖాదిరంతు విశిష్యతే |
ఖాదిరాత్పుష్పసాహస్రాత్‌ శమీపుష్పం విశిష్యతే ||
హిరణ్యమున పుట్టిన పుష్పములతో, పర్వతసంభవములైన పత్రములతో ఒక ఝాము దాటని వాటితోఛిద్రములు లేనివాటితో ప్రోక్షణ చేయబడినవాటితో జంతువర్జితములతో, ఆరామములలో పుట్టినవాటితో నన్ను పూజించవలయును. పుష్పజాతి విశేషములతో పుణ్యవిశేషము కలుగును. తపస్సు, శీలము గుణములు కల వేదపారగుడైన బ్రాహ్మణుని యందు పది సువర్ణముల నిచ్చిన కలుగు ఫలము మార్గశీర్షమాసమున పుష్పదానము చేసిన కలుగును. నాకొక్క ద్రోణపుష్పమును నివేదించినచో దశ సువర్ణములను దానము చేసిన దానికంటే అధిక పుణ్యము కలుగును. ఒక పుష్పము కంటె ఇంకొక పుష్పమునకున్న భేదమును తెలియుము. వేయి ద్రోణ పుష్పముల కంటే ఒక శమీ పుష్పము విశిష్టమైనది.

డా|| కందాడై రామానుజాచార్య ఎమ్‌.ఎ., పి.హెచ్‌డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement