Wednesday, November 20, 2024

ధ‌ర్మం మ‌ర్మం – మార్గశిరమాస విశిష్టత

బిల్వపత్రాత్‌ శమీపత్రాత్‌ జాతీ పత్రాత్సరోరుహాత్‌ |
వల్లభం తులసీ పత్రం కౌస్తుభాదధికం మమ ||

అభిన్నపత్రా తులసీ హృద్యామంజరి సంయుతా |
క్షీరోదార్ణవ సంభూతా పద్మేవేయం సదా మమ ||

అకృష్ణాప్యధవా కృష్ణా తులసీ మమ వల్లభా |
సితావాప్య సితావాపి ద్వాదశీ వల్లభా యధా ||

గృహీత్వా తులసీపత్రం భక్త్వా యోమాం సమర్చయేత్‌ |
అర్చితం తేన సకలం సదేవాసుర మానుషమ్‌ ||

- Advertisement -

తావద్గర్జన్తి రత్నాని కౌస్తుభాదీన్యనన్తశ: |
యావన్న ప్రాప్యతే కృష్ణా తులసీ కృష్ణ మంజరీ ||

బిల్వపత్రము కంటే శమీపత్రము కంటే జాతిపత్రము పద్మము కంటే తులసీపత్రము కౌస్తుభమణి కంటే అధిక ప్రియమైనది. భిన్నము కాని పత్రములు కల తులసి మంజరులతో కూడియున్నది నాకు హృదయంగమమైనది. క్షీరసాగరమున పుట్టిన లక్ష్మివలె నాకు ప్రియమైనది. కృష్ణ తులసి కాని, అకృష్ణ తులసి కాని తులసి నాకు ప్రియమైనది. శుక్లపక్ష ద్వాదశి లేదా కృష్ణపక్షద్వాదశి ప్రియమైనట్లుగా, తులసీపత్రమును తీసుకొని భక్తితో నన్ను అర్చించినవాడు సదేవాసుర మానుషమైన సకల లోకములను అర్చించినవాడగును. అనన్తమైన కౌస్తుభాది రత్నములన్నీ కృష్ణ మంజరి కల కృష్ణ తులసి లభించనంతవరకు గర్జించుచుండును.

డా|| కందాడై రామానుజాచార్య ఎమ్‌.ఎ., పి.హెచ్‌డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement