Tuesday, November 26, 2024

ధ‌ర్మం మ‌ర్మం – మార్గశిరమాస విశిష్టత

నాగారి చిహ్నితా ఘంటా రథాంగేన సమన్వితా |
వాదనాత్కురుతే నాశం జన్మకోటి భయస్య వై ||

గరుడేనాంకితాం ఘంటాం దృష్ట్యా హం ప్య్రహం ముదా|
ప్రీతిం కరోమి దేవేశ లక్ష్మీం ప్రాప్యయధా ధన: ||

ఘంటా దండస్య శిరసిసు చక్రం స్థాపయేత్తుయ: |
మత్ప్రియం వైనతేయం వా స్థాపితం భువనత్రయమ్‌ ||

ఘంటానాదం సుచక్రంచ అంత కాలే శృణోతియ: |
పాపకోటి యుతస్యాపి నశ్యంతి యమకింకరా: ||

సర్వే దోషా: ప్రణశ్యంతి ఘంటానాదే నవై సుత |
దేవతానాంచ రుద్రాణాం పిత ౄనాముత ్సవో భవేత్‌ ||

- Advertisement -

అభావే వైనతేయస్య చక్రస్యాపిన సంశయ: |
ఘంటా నాదేవ భక్తానాం ప్రసాదం ప్రకరోమ్యహమ్‌ ||

గరుడ చిహ్నితమైన ఘంట లేదా చక్రాంకితమైన ఘంటను మోగించినందున కోటి జన్మల భయమును కూడా నశింపచేయును. గరుడ చిహ్నితమైన ఘంటను చూచి నేను ప్రతిదినము ధనము లేనివాడు సంపదను పొంది ప్రీతిచెందినట్లు నేను ప్రీతి చెందెదను. ఘంటాదండము యొక్క శిరమున చక్రమును స్థాపించినవాడు, నాకు ప్రీతిపాత్రుడైన గరుడుని స్థాపించిననూ భువనత్రయమును స్థాపించినవడగును. చక్రముతో కూడిన ఘంటానాదమున అంతకాలమన వినినవాడు కోటి పాపముల కల వాడైననూ యమకింకరులు దూరమయ్యెదరు. ఘంటానాదముతో సకల దోషములు నశించును. దేవతలకు, రుద్రులకు, పితరులకు ఉత్సవమగును. గరుడుడు చక్రము లేకున్ననూ ఘంటానాదముతో భక్తులను నేను అనుగ్రహించెదను.

డా|| కందాడై రామానుజాచార్య ఎమ్‌.ఎ., పి.హెచ్‌డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement