Saturday, November 23, 2024

ధ‌ర్మం మ‌ర్మం – మార్గశిరమాస విశిష్టత

సాంబు శంఖం కరే ధృత్వా మంత్రైరేతైస్తు వైష్ణవ! |
యస్స్నాపయేన్మార్గశీర్షే తుష్టస్తస్య భవామ్యహమ్‌ ||

శంఖదౌ చంద్ర దైవత్వం కుక్షౌ వరుణ దేవతా |
పృష్ఠేప్రజాపతిశ్చైవ అగ్రే గంగా సరస్వతీ ||

తేషా ముచ్చారపూర్వం తు స్నాపయేన్మామతంద్రిత: |
తస్య పుణ్యస్య సంఖ్యాం వై కుర్తుం నైవ సురా: క్షమా: ||

పురతో మమ దేవేశ స పుష్ప: సజలాక్షత: |
శం ఖస్త్వభ్యర్చితస్తిష్ఠేత్‌ తస్యశ్రీ స్యర్వతోముఖీ ||

విలేపనేన సంపూర్ణం శంఖం కృత్వాతు మాం భజేత్‌ |
తదా మే పరమా ప్రీతి: భవేద్వై శతవార్షికీ ||

- Advertisement -

జలముతో నున్న శంఖమును చేతిలో పట్టుకొని విష్ణుభక్తుడు మార్గశీర్షమున స్నానము చేయించినచో నేను సంతోషించెదను. శంఖము ఆదిలో చంద్రుడు, కుక్షియందు వరుణ దేవత, పృష్ఠమున ప్రజాపతి, అగ్రభాగమున గంగా సరస్వతి ఉండును. ఆయా దేవతలనుచ్చరించుచు నాకు స్నానము చేయించవలయును. ఆ పుణ్యము ఇంత అని దేవతలు కూడా లెక్కింపజాలరు. దేవేశ! నా ముందు పుష్పములు, జలములు, అక్షతలతో శంఖమును అర్చించ వలయును. అతని సంపద సర్వతోముఖమగును. సంపూర్ణ చిహ్నమును విలేపనము చేసి నన్ను సేవించవలయును. అప్పుడు నాకు నూరు సంవత్సరముల ప్రీతి కలుగును.

డా|| కందాడై రామానుజాచార్య ఎమ్‌.ఎ., పి.హెచ్‌డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement