Tuesday, November 26, 2024

ధ‌ర్మం మ‌ర్మం – మార్గశిరమాస విశిష్టత

శంఖో తోయం సమాదాయ యస్స్నాపతి మాం సుత!|
నమో నారాయణత్యుక్త్వా ముచ్యతే సర్వకిల్బిషై: ||

కృత్వా పాదోదకం శంఖే వైష్ణవానాం మహాత్మనామ్‌ |
యో దదాతి తిలోన్మిశ్రం చాంద్రాయణ ఫలం లభేత్‌ ||

నాద్యం తటాకజం వాపి వాపీకూపాదికం చ యత్‌ |
గాంగేయం జాయతే సర్వం జలం శంఖకృతం చ యత్‌ ||

గృహీత్వ మమ పాదాంబు శంఖే కృత్వా తు వైష్ణవ!|
యో వహే చ్ఛిరసా నిత్యం సముని స్తపతాం వర: ||

త్రైలోక్యే యాని తీర్థాని మమ చైవాజ్ఞయా సుత |
శంఖే తాని వసంతీహ తస్మాచ్ఛంఖో వరస్స్మృత: ||

- Advertisement -

శంఖమున జలమునుంచి స్నానమును చేయించినవాడు నమో నారాయణ అనుచున్నచో అన్ని పాపములచే విడుదల అగును. మహానుభావులైన శ్రీవైష్ణవులు పాదజలమును నువ్వులతో కలిపి ఇచ్చినచో చాంద్రాయణ ఫలమును పొందును. నదీ జలమును తటాకజలము దిగుడు బావి నీరుచేత బావినీరును శంఖములో పోసినచో గంగాజలమగును. నా పాదజలమును తీసుకొని శంఖములో నుంచి శిరమున ధరించినచో అతను తపము చేయు వారిలో శ్రేష్ఠుడైన మునియగును. మూడు లోకములలో నన్న సకల తీర్థములు నా ఆజ్ఞతో శంఖమున నుండును. కావున శంఖము శ్రేష్ఠమైనది.

డా|| కందాడై రామానుజాచార్య ఎమ్‌.ఎ., పి.హెచ్‌డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement