తస్మాత్సర్వ ప్రయత్నేన మాన్యా పూర్ణా విచ క్షణౖ: |
మార్గశీర్షేణ సంయుక్తా అనంత ఫలదాయినీ ||
యథా తే కథితం వత్స మార్గశీర్ష మమప్రియమ్ |
కరోతి యో నరో భక్త్యా తస్య పుణ్యఫలం శృణు ||
తీర్థాయుతేషు యత్పుణ్యం యత్పుణ్యం వ్రత కోటిభి: |
సర్వయజ్ఞేషు యత్పుణ్యం తత్పుణ్యం సమవాప్నుయాత్ ||
బ్రాహ్మణో బ్రహ్మవర్చస్వీ క్షత్రియో విజయీ భవేత్ |
వైశ్యో నిధిపతిత్వం చ శూద్రశ్శుద్ధ్యేత పాతకాత్ ||
మార్గశీర్షముతో కూడిన పూర్ణిమను సర్వప్రయత్నములతో ఆరాధించవలయును. అనంతఫలమును ప్రసాదించును. మార్గశీర్షము నాకు ప్రియమని చెప్పినట్లుగా ఆ మాసమున పూజాదులను ఆచరించినచో భక్తితో నున్నవాని పుణ్యఫలమను వినుము. పది లక్షల తీర్థములలో కలుగు పుణ్యము కోటి వ్రతములతో కలుగుపుణ్యము, సర్వయజ్ఞములలో కలుగు పుణ్యము ఈ పూర్ణిమనాడు లభించును. పుత్రులు లేనివారు పుత్రుని, ధనము లేనివారు ధనమును, విద్యార్థి విద్యను, రూపమును కోరువారు రూపమును పొందును. బ్రాహ్మణుడు బ్రహ్మవర్చస్సును, క్షత్రియుడు విజయమును, వైశ్యుడు నిధిపతిత్వమును, శూద్రుడు త్రివిధ పాతకముల నుండి శుద్ధిని పొందును.
డా|| కందాడై రామానుజాచార్య ఎమ్.ఎ., పి.హెచ్‌డి.