వైష్ణవానాం వ్రతానాంచ కుర్యాత్స్వీకరణం బుధ:|
మత్ప్రియం శృణుయాత్ శశ్వచ్ఛ్రీమద్భాగవతం పరమ్ ||
శ్రీమద్భాగవతం నామ పురాణం లోక విశ్రుతమ్ |
శృణు యాచ్ఛ్రద్ధయా యుక్తో మమ సంతోషకారణమ్ ||
నిత్యం భాగవతం యస్తు పురాణం పఠతే నర: |
ప్రత్యక్షరం భవేత్తస్య కపిలాదానజం ఫలమ్ ||
శ్లోకార్థం శ్లోక పాదం వా నిత్యం భాగవతోద్భవమ్ |
పఠతే శృణు యాద్యస్తు గోసహస్ర ఫలం లభేత్ ||
య: పఠేత్ప్రయతో నిత్యం శ్లోకం భాగవతం సుత |
అష్టాదశ పురాణానాం ఫలమాప్నోతి మానవ: ||
నిత్యం మమ కథాయత్ర తత్ర తిష్ఠంతి వైష్ణవా:|
కలి బాహ్యా నరాస్తేవై యేర్చయన్తి సదా మమ ||
తెలిసినినవాడు శ్రీవైష్ణవవ్రతములను స్వీకరించవలయును. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన ఉత్తమమైన శ్రీమద్భాగవతమును నిత్యము పఠించవలయును. వినవలయును. శ్రీమద్భాగవతమను పురాణము లోకప్రసిద్ధమైనది. నాకు సంతోషకారణమైన శ్రీమద్భాగవతమును శ్రద్ధగా వినవలయును. ప్రతి నిత్యముక భాగవత మహాపురాణమును పఠించు మానవుడు ప్రత్యక్షరము కపిలా గోదాన ఫలమును పొందును. ప్రతి నిత్యము భాగవత శ్లోకములోని సగము కాని శ్లోకపాదమును కాని చదివిననూ వినిననూ సహస్ర గోదాన ఫలము లభించును. శ్రద్ధ కలవాడై నిత్యము భాగవత శ్లోకమును పఠించువాడు అష్టాదశ పురాణ పఠన ఫలము లభించును. నిత్యము నా కథ జరుగుచోట వైష్ణవులుందురు. అక్కడ నరులు కలికి దూరముగా నుందురు. నా అర్చన చేయువారిని కలి తాకజాలడు.
డా|| కందాడై రామానుజాచార్య ఎమ్.ఎ., పి.హెచ్డి.