సర్వేషామావ దానానాం విశేషంచ త్రికం స్మృతమ్ |
వసుంధరా తతా ధేనుర్విద్యా దానం తథైవచ ||
దత్తే దానత్రికే వత్స భవేత్ప్రీతిర్మమాతులా |
తస్మాన్నరైస్తు కర్తవ్యం సహో మాసే త్రికం శుభమ్ ||
స్నానస్య చ విధిస్సమ్యక్ పురైవోక్తో మమానఘ |
పూజా స్నానం చ దానంచ విధిరేష నసంశయ: ||
మార్గశీర్షం స మగ్రం తు ఏకభుక్తేన యం క్షిపేత్ |
భోజయేద్యో ద్విజాన్భక్త్వా సమచ్యేద్వ్యాధి కిల్బిషై: ||
కృషిభాగే బహుధనో బహుధాన్యశ్చ జాయతే |
కిమత్ర బహు నోక్తేక శృణు గుహ్యం పరం మమ||
హుత భుగ్బ్రాహ్మణశ్చైవ వదనం మమ మానద |
బ్రాహ్మణాఖ్యం ముఖం శ్రేష్ఠం న తథాహవ్యవాహన: ||
అన్ని దానములలో మూడు దానములు విశేషించి చెప్పబడినవి. భూదానము, గోదానము, విద్యాదానము,. ఈ మూడు దానములను చేసినచో నాకుప్రీతి కలుగును. కావున మార్గశీర్ష మాసమున మానవులు ఈ మూడు దానములను చేయవలయును. ఇన స్నానవిధిని ఇదివరకే చక్కగా చెప్పితిని. పూజ స్నానము, దానము ఇదియే విధి. ఇందులో సందేహము లేదు. సంపూర్ణ మార్గశీర్ష మాసమున ఒకే పూట భజించవలయును. బ్రాహ్మణులను భక్తితో భుజింపచేయవలయును. అట్టివాడు వ్యాధి కిల్బిషములతో విడివడును. అట్టివాడు కృషి భాగి బహుధనవంతుడు బహుధాన్యము కలవాడు అగును. ఇంకా యేమి చెప్పవలయును. నా పరమ రహస్యము వినుము. అగ్నిహోత్రుడు బ్రాహ్మణుడు నా ముఖముగా తెలియుము. బ్రాహ్మణుడను ముఖమే శ్రేష్ఠము. అగ్నిహోత్రుడంత ముఖ్యము కాదు.
డా|| కందాడై రామానుజాచార్య ఎమ్.ఎ., పి.హెచ్‌డి.