జాగరే మే చతుర్వక్త్ర కర్పూరేణ చ దీపకమ్ |
యో జ్వాలయేత నీరాజం కపిలా దానజం ఫలమ్ ||
య: పున: కురుతే దీపం గీతం నృత్యం చ పూజనమ్ |
శతక్రుతు సమం పుణ్యం వ్రతైర్దాన శతైరపి ||
స్వయం య: కురుతే గీతం విలజ్ఞ: నృత్యతే యది |
సలభేన్నిమిషార్థేన కోటి యజ్ఞ కృతం ఫలమ్ ||
నివారయతి యో గీతం నృత్యం జాగరణ మమ|
షష్టిర్యుగ సహస్రాణి పచ్యతే రౌరవాదిషు ||
నృత్య మానస్య మర్త్యస్య యేకేచిన్ని కటేగతా: |
విముక్తా ధర్మరాజేన ముక్తా యాంతి చ మత్పదమ్ ||
నృత్యమానస్య మర్త్యస్య ఉపహాసం కరోతి య: |
జాగరే యాంతి నిరయం యావదిన్ద్రా శ్చతుర్దశ ||
ఏకాదశి నాడు నాకు కర్పూరముచే దీపమును నీరాజనమును వెలించినవాడు కపిలా గోదాన ఫలమును పొందును. నా ఏకాదశి నాడు దీపమును, గీతమును, నృత్యమును, పూజనమును చేసిన వాడు నూరు క్రతువుల పుణ్యమును, దానశతముల పుణ్యమునుపొందును. తాను స్వయముగా గానము చేసినవాడు సిగ్గువిడిచి నృత్యము చేసినవాడు ఒకటిన్నర నిమిషములో కోటి యజ్ఞకృతఫలమును పొందును. ఏకాదశినాడు చేయుచున్న నృత్యమును గీతమును నివారించువాడు 60 వేల యుగములు రౌరవాది నరకములలో పడి మ్రగ్గును. నాట్యము చేయుచున్నవాని సమీపమునకు వెళ్ళినవాడు కూడా ధర్మరాజుచే విడువబడి ముక్తులై పరమ పదమును పొందెదరు. నాట్యము చేయుచున్నవానిని పరిహాసము చేసినవాడు ఒక మన్వన్తరకాలము నరకమును పొందును.
డా|| కందాడై రామానుజాచార్య ఎమ్.ఎ., పి.హెచ్‌డి.