Wednesday, December 4, 2024

ధర్మం – మర్మం : ఋషులు (ఆడియోతో…)

మహాభారతంలోని సుభాషితం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
జయో మంత్రా: తధా వేదా: దేహమేకం త్రిధాకృతమ్‌
న హాయనై: న పలితై: న మిత్రేణ న బంధుభి:
ఋషయ: చక్రిరే ధర్మం యోనూచాన: సనోమహాన్‌

ఒకే దేహం జయము, మంత్రం, వేదం అని మూడుగా చేయబడినది అనగా ధర్మమే వేదమునకు దేహం. ఈ ధర్మము జయమని, మంత్రమని వేదములని మూడు విధములు. మొదట వేదముగా తెలిసి తరువాత దైవాన్ని, సౌకర్యాన్ని, సంతోషాన్ని పొంద డానికి మంత్రాలను పొంది ఆ మంత్రాలతో ఇహమున, పరమున తాననుకున్న లక్ష్యమును అనగా జీవనమును, మోక్షమును అందుకొనుట జయము అనబడును. ఇట్లు వేదము ధర్మాన్ని, మంత్రాలను, జయమును అందిస్తుంది. ఆ వేదం చెప్పిన ధర్మం గూర్చి అనేక వేల సంవత్సరాలలో కూడ తెలుసుకోలేము. ఋషులు పరంపరగా జ్ఞానులచే ఆచరించబడే ఆచారాన్ని మనకు ధర్మముగా అందజేశారు. ధర్మాన్ని తెలిపినది వేదం అయితే అది మనకు అర్థం కాదు కావున మనకి అర్థమయ్యే రీతిలో పరంపరగా వచ్చే దానిని మనకి ఋషులు అందించారు. అలా పరంపరగా వచ్చి వేద బోధితమైన ధర్మాన్ని తెలిపి తాము ఆచరించి ఇతరుల చేత ఆచరింప చేసేవారు లౌకిక జీవనాన్ని, పారమార్ధిక జీవనాన్ని, స్వర్గాదులలో నివసించడాన్ని కాదని ఇవి తమకు వద్దని పరమాత్మను ఆరాధించడమే నిజమైన ధర్మమని బోధించిన వారు ఋషులు. అందుకే మన వేదం ”నమ: పరమ ఋషిభ్య:” అని ఋషులకు నమస్కరించినది కావున ఉదయాన్నే లేచి ఒకసారి ”నమ: పరమ ఋషిభ్య:” అని మనమూ మనసారా తలచి వారందించిన ధర్మాన్ని తెలుసుకుందాం.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement