నలుగుపిండి గణపతి అంతరార్థం గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యలవారి వివరణ..
పార్వతీ దేవి స్నానమాచరిస్తూ నలుగుపిండితో బొమ్మను చేయడం అందులో ప్రాణం పోయడం ఈ అంశాలను ఒకసారి పరిశీలిస్తే నలుగుపిండితో స్నానం అనగా శరీరాన్ని వేళ్ళతో నలుపుతూ అక్కడ ఉండే మట్టిని బయటకు తీయడం. పసుపు కలిపిన ఈ పిండిని మన ఒంటిపై రాస్తే ఒంటికి ఉన్న మలినాలతో కలిసి నల్లగా మారుతుంది. పచ్చపిండిని నలుపు చేసే మన శరీరం వాస్తవానికి మట్టేనని ఆ మట్టికి ఎన్ని రంగులు పూసినా చివరకు మిగిలేది మట్టి రంగేనని నలుగుపిండి ద్వారా లోకానికి తెలియజేసింది అమ్మ. భగవంతుడు మట్టితో బొమ్మను చేసి ప్రాణం పోస్తే ‘మనిషి’, అదే ప్రాణంపోతే ‘బొమ్మ’ అని గణపయ్య అవతరించకముందే తెలియజేశాడు.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి
—