కాలుతున్న రావణకాష్టంలోని అంతరార్థం గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
వాల్మికి రామాయణంలో కాక ఇతర రామాయణాల్లో ఉన్న ఈ గాధను అనుసరించి రావణాసురుని సంహరించిన తరువాత అతని భార్య మండోదరి విలపిస్తుంటే ఆమెను ఓదార్చటానికి వచ్చిన రాముడు ఆమెకు ఒక వరమిచ్చాడు. దహనం అనంతరం అస్థి నిమజ్జనాదులు జరిగి అంత్య క్రియలు పిదప వైధవ్యం ప్రాప్తిస్తుంది కావున మండోదరికి ఆ అవస్థ రాకూడదని ప్రళయకాలం వరకు రావణ కాష్టం కాలుతూనే ఉంటుందని రాముడు వరమిచ్చాడు. యుద్ధములో మరణించిన వారికి అంత్యక్రియలతో పని లేకుండానే ఉత్తమ గతి లభిస్తుంది కావున ఇతర సమస్యలు రావు. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ రావణకాష్ఠం కాలుతూనే ఉంటుంది అనేది ఒక గాధ. ఆ గాథను అనుసరించి ఈ సామెత నానుడి పోలిక ఏర్పడినది.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి