Thursday, January 23, 2025

ధర్మం – మర్మం : ఋషి హృదయం, భాగవత వైభవం -21 (ఆడియోతో…)

పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
21.

న గంగా న గయా కాశీ పుష్కరం న ప్రయాగ కం
శుక శాస్త్ర కధాయాశ్చ ఫలేన సమతాం నయేత్‌

గంగా, గయా, కాశీ, పుష్కరం, ప్రయాగ ఈ పుణ్యతీర్థములన్నీ భగవంతుని కథలను బోధించిన భాగవతంతో సమానమైన ఫలమును ఈయజాలవు.
పుణ్య తీర్థములలో కేవలం తీర్థములు, తీర్థములను సేవించిన వారే ఉందురు. కాశీ మొదలగు పుణ్యక్షేత్రములలో ఆ పుణ్య క్షేత్రములు వాటిని సేవించే భక్తులు మాత్రమే ఉంటారు. కానీ భాగవతంలో పుణ్య క్షేత్రములు, పుణ్యతీర్థములు, వాటిని సేవించే భక్తులు ఉన్నారు, పుణ్యతీర్థాలలో వేంచేసి ఉన్న పరమాత్మ అవతారాలు ఉన్నాయి. ఏ పుణ్య తీర్థానికి వెళ్లితే దానినే సేవిస్తారు, ఏ పుణ్య క్షేత్రానికి వెళితే ఆ అవతారాన్నే పూజిస్తారు కానీ భాగవతంలో అన్నీ పుణ్య క్షేత్రాలు, పుణ్య తీర్థాలు, భగవంతుని అవతారాలు, భక్తుల కథలు ఉన్నాయి. అన్నీ ఉన్న భాగవతంతో గయా కాశీ ఎలా సమానమవుతాయని భావం.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement