Wednesday, November 20, 2024

ధర్మం – మర్మం : ఋషి హృదయం, భాగవత వైభవం -19 (ఆడియోతో…)

పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

19.
అశ్వమేధ సహస్రాణి వాజపేయ శతానిచ
శుక శాస్త్ర కధాయాశ్చ కలాం నార్వతి షోడశీమ్‌

వేయి అశ్వమేధ యాగములు, నూరు వాజపేయ యాగములు, శుక శాస్త్రమైన భాగవత కథ యొక్క 16వ భాగంతో సమానం కాదు. అనగా అశ్వమేధంలో గాని, వాజపేయంలో గాని యజ్ఞం చేసేవారు యజ్ఞం చూడటానికి వచ్చేవారు ఏ దైవము గూర్చి యజ్ఞము చేస్తున్నారో ఆ దైవ మహిమ లేదా దైవ సన్నిధిని చేసే వారు, చూసే వారు, కోరుకున్న కోరికలు అవి తీరిన భక్తులు ఈ సన్నివేశములు మాత్రమే ఉండును. కానీ భాగవత కథలో అశ్వమేధాలను, వాజపేయం చేసిన వారి కథలు ఇంకా పుండరీకము, సోమయాగము, అతిరాత్రము మొదగు ఎన్నో యాగముల యొక్క భావము, ఎందరో యజమానుల ప్రభావము, పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుని అనంత అవతార ప్రభావములు భక్తులైన ప్ర హ్లాదాదుల చరితము, గంగా ప్రయాగాది నదులు, అయోధ్య, మధుర, మాయాది పుణ్యక్షేత్రములు ఇలా భూలోకమంతా మరియు భూలోకమునకు కింద ఉన్న 7 లోకాలు, ఆ పైన ఉన్న వైకుంఠ మహా నగరం ఇలా ఇన్ని విశేషాలున్న భాగవతంలో అశ్వమేధం, వాజపేయం నిజంగా ఎన్నోవంతు?

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement