పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
18.
కధా భాగవతస్యాపి నిత్యం భవితియత్ గృహే
తత్ గృహం తీర్థ రూపంహి వసతాం పాప నాశనమ్
భాగవత కథ ప్రతి నిత్యము జరుగుతున్న గృహము పుణ్య తీర్థముగా మారుతుంది. ఆ గృహములో ఉన్న వారికి సకల పాపములు నశించును . పుణ్యతీర్థం అంటే పవిత్రములైన గంగా, యమునా, సరస్వతీ, కావేరీ, తుంగభద్రా, సింధూ, గోదావరీ మొదలగు నదుల ప్రాంతం. భాగవతంలో 5వేల నదుల పేర్లు ఆ నదుల కథలు, పుట్టుకలు ఆ నదీ తీరంలో వేంచేసి ఉన్న ఆ భగవానుని అవతారములు, కథలు ఉంటాయి. అలాంటి భగవంతుని ఆ నదులును సేవించిన భక్తుల కథలను తమ పాపములను నశింప చేసుకున్న మహానుభావుల కథలూ ఇవన్నీ కూడా భాగవతంలో ఉంటాయి. ఆ కథలు వినేవారు ఆ నదులు, క్షేత్రముల వింటారు పలుకుతారు. స్నానం చేసి పాపములు పోగొట్టుకున్న భక్తుల కథలు వింటారు. ఇన్ని పలకబడుచున్న, వినబడుచున్న ఆ ఇల్లు పుణ్యతీర్థమే కదా. పుణ్యతీర్థం కేవలం ఒక నది మాత్రమే కాని భాగవతం నది, నదీ తీరములలో క్షేత్రాలు, స్నానం చేసిన భక్తులు వారి చరితల సమూహం. అందుకే భాగవత కథాగానం జరుగుతున్న ఇల్లు మహా పుణ్యతీర్థం. అటువంటి ఇంట్లో ఉంటే పుణ్యతీర్థమున ఉన్నట్లే అందుకే ఆ ఇంట ఉన్న వారి పాపాలు నశిస్తాయని అంటారు.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి