Thursday, November 7, 2024

ధర్మం – మర్మం : ఋషి హృదయం, భాగవత వైభవం -13 (ఆడియోతో…)

పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

సారమే ఫలప్రదము
13.
ఆమూలాగ్రం రసస్తిష్టన్‌ ఆస్తే న స్వాద్యతే యధా
సభూయ: సంపృధగ్భూత: ఫలే విశ్వమనోహర:

వేద ములు, వేదాంతములు ధర్మ శాస్త్రములు ఇతిహాసములు, ఆగమములు, దివ్య ప్రబంధములు వీటి అన్నింటి సారమే శ్రీ మద్భాగవతమని ఈ శ్లోకము భాగవత పురాణ మహాత్మ్యమును చెప్పుచున్నది.

నారద మహర్షికి సనకాదులు భాగవత సప్తాహం వినమని చెప్పినపుడు వేద వేదాంతములతో జరగని పని భాగవతుముతో ఎట్లు జరుగుతుందని ప్రశ్నించగా అన్నింటి సారమే భాగవతమని పలికెను. ఒక మహా వృక్షంలో వేరు నుండి చిటారు కొమ్మల చిగురాకు వరకు ఆ వృక్ష సారం ఉంటుంది అయినా వేరునో, కొమ్మనో, రెమ్మనో, ఆకునో, పువ్వునో ఆస్వాదిస్తే సారం లభించదు. అదే వృక్ష సారమైన ఫలమును భుజిస్తే ఆ రసం అనుభవించబడుతుంది. కొమ్మలో, రెమ్మల్లో సారమున్నా అనుభవించలేము ఫలము తోనే తృప్తి. అలాగే వేద వేదాంత పురాణాలతో కాని పని శ్రీమద్భాగవత శ్రవణంతో నెరవేరుతుంది. మూలం కాకుండా సారాన్ని సేవించండి. సారమే సర్వ ఫలప్రదమని ఈ శ్లోకంలో ఋషి హృదయం.

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement