Thursday, January 9, 2025

ధర్మం – మర్మం : ఋషి హృదయం, భాగవత వైభవం -14 (ఆడియోతో…)

పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

14.
యధా దుగ్ధే స్థితం సర్పి: నస్వాదాయ ఉపకల్పతే
పృదగ్భూతం హితత్‌ గవ్యం దేవానాం రసవర్ధనమ్‌

పాలలో అంతటా నెయ్యే ఉంటుంది కాని పాలు తాగితే నెయ్యి రుచి వస్తుందా. యజ్ఞ యాగాలలో ఆహుతులుగా నెయ్యికి బదులు పాలు పోస్తే యజ్ఞం సఫలం అవుతుందా. దేవతలు ఆ పానం తీసుకుంటారా అసలు అగ్ని జ్వలిస్తుందా. ఆ పాల నుండి తీసిన పాల సారముగా పేర్కొనబడే నెయ్యి హవిస్సుగా యజ్ఞంలో సమర్పిస్తే దేవతలకు ప్రీతి కలుగుతుంది. పాలు మూలము నెయ్యి సారము. మూలంతో కాని పని సారంతోనే అవుతుందని ఇక్కడ ఋషి హృదయం.

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement