Monday, January 6, 2025

ధర్మం – మర్మం : ఋషి హృదయం, భాగవత వైభవం -10 (ఆడియోతో…)

పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
10
భక్తి
నృణాం జన్మ సహస్రేణ భ క్తౌ ప్రీతిర్హి జాయతే
కలౌ భక్తి: కలౌ భక్తి: భక్త్యా కృష్ణ: పుర:స్థిత:

మానవులుగా కొన్ని వేల జన్మలు ఎత్తిన తరువాత పరమాత్మ దయతో భక్తి యందు ప్రీతి కలుగుతుంది. సకల లోకనాధుడు, సకల లోకాలను సృష్టించే వాడు, రక్షించే వాడు, సంహరించే వాడు, నియమించే వాడు అని తెలిసినా భగవంతుడిని పూజించకుం టే ఏమి చేస్తాడో అన్న భయంతో పూజిస్తాం, కొలుస్తాము. భగవంతుడు నా వాడు, అన్ని బంధాలలో(అమ్మ, నాన్న, అక్క, చెల్లిd…) అంతా భగవంతుడే అన్న ప్రేమతో అతను నా వాడు నాకు కావలసిన వాడు నన్ను కంటికి రెప్పలా కాపాడే వాడు నా స్వామికి నేను సేవ చేయాలని ఒక యశోదలా, ఒక వకుళమాలికలా, ఒక కౌసల్యలా స్వామిని ప్రేమించగలగడాన్ని భక్తి అంటారు. ఈ భక్తి ఆవేశంలో స్వామినే నేను రక్షించాలనే భావనలో అన్నీ మరిచిపోతారు. ఇదే భక్తి యందు ప్రీతి కలగడం. కలియుగంలో భక్తి మాత్రమే భగవంతుడిని మన ముందు నిలుపుతుంది. భక్తి ఉన్న చోట భగవంతుడు ముందు నిలుస్తాడని ఈ శ్లోకంలోని ఋషి హృదయం

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement