Home భక్తిప్రభ ధర్మం – మర్మం : పాపపరిహారం, కార్యసిద్ధి (ఆడియోతో..)

ధర్మం – మర్మం : పాపపరిహారం, కార్యసిద్ధి (ఆడియోతో..)

0
ధర్మం – మర్మం : పాపపరిహారం, కార్యసిద్ధి (ఆడియోతో..)
https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/12/DM-09.12.17.mp3

శివమహాపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

యత్ర యత్ర యధా భ క్తి కర్తవ్యం పూజ నాధికం
వినాపూజన దానాది పాతకం నచ దూరత:
యావచ్ఛ పాతకం దేహే తావత్‌ సిద్ధి: నజాయతే
గతేచ పాతకేతస్య సర్వంచ సఫలం భవేత్‌
తధాచ మలినే వస్త్రే రంగ శ్శుభ తరోనహి
క్షాలనేన కృతే శుద్ధే సర్వో రంగ: ప్రసజ్జతే
తధాచ నిర్మలే దేహే దేవానాం సమ్య గర్చయా
జ్ఞాన రంగ: ప్రజాయేతే తధా విజ్ఞాన సంభవ:

తనకిష్టమైన ఆయా దైవమును భక్తికనుగుణంగా పూజానాదులు చేయవలెను. భగవంతుని పూజలో దానం చేయనిచో పాపము తొలగిపోదు. ఈ శరీరంలో పాపము ఉన్నంత వరకు అనుకున్న పనేమీ సిద్ధించదు. పాతకం తొలగిపోయినచో సకల కార్యములు సఫలమగును. వస్త్రమున మలినము ఉన్నచో ఆ వస్త్రముకున్న రంగు స్పష్టముగా కనబడదు. వస్త్రమును చక్కగా ఉతికినచో దానికున్న మలినము తొలగి వస్త్రము యొక్క రంగు అంతా సుస్పష్టముగా తెలుస్తుంది. పాతకము అంటే దేహానికి ఉన్న మురికి. వస్త్రానికున్న మురికిని సబ్బుతోటి, ఇతర చూర్ణములతోటి ఉతికి పోగొట్టుకుంటాము. దేహానికి ఉన్న పాపమనే మురికిని భగవంతుడిని చక్కగా ఆరాధించినచో తొలగును. పాపం తొలగితే అప్పటి దాకా లోపల ఉన్న జ్ఞానమనే రంగు ప్రకాశిస్తుంది. జ్ఞానము ప్రకాశిస్తే, సరైన జ్ఞానంతో చేసిన పని సఫలం అవుతుంది. సరైన జ్ఞానం పాపం తొలగితేనే వస్తుంది, ఈ పాపము భగవదారాధనతో తొలగును.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Exit mobile version