Wednesday, November 20, 2024

ధర్మం – మర్మం (ఆడియోతో..)

గంగా జలం మర్త్యలోకం చేరు విధానంలో భాగంగా పరమపావని అయిన గంగ గౌతమునిచే స్తుతించబడిన విధానం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

గౌతముని స్తోత్రమునకు సంతోషించిన పరమశివుడు వరమును అనుగ్రహించగా శివుని జటలలో ఉన్న గంగను విడువమని ప్రార్థిస్తూ గౌతముడు ఈ విధంగా కోరెను.
ఇమామ్‌ దేవీం జటా సంస్థాం పావనీం లోకమాతరం
తవ ప్రియాం జగన్నాధ ఉత్సృజ బ్రహ్మణోగిరౌ

సర్వాసాం తీర్థ భూతాతు యావత్‌ గచ్ఛతి సాగరం
బ్రహ్మ హత్యాది పాపాని మనో వాక్కాయి కానితు

స్నాన మాత్రేణ సర్వాణి విలయం యాంతు శంకర
చంద్ర సూర్యోపరాగేచ అయనే విషువేతదా

సంక్రాంతౌ వైధృతౌ పుణ్యతీర్థేషు అన్యేషు యత్ఫలం
అస్యాస్తు స్మరణాదేవ తత్‌ పుణ్యం జయతాం వర

- Advertisement -

శ్లాఘ్యం కృతే తప: ప్రోక్తం త్రేతాయాం యజ్ఞకర్మచ
ద్వాపరే యజ్ఞదానేచ దానమేవ కలౌయుగే

యుగ ధర్మాశ్చ యే సర్వే దేశ ధర్మాస్త దైవచ
దేశ కాలాది సంయోగే యో ధర్మో యత్ర శస్యతే

యదన్యత్ర కృతం పుణ్యం స్నాన దానాది సంయమై:
అస్యాస్తు స్మరణాదేవ తత్పుణ ్యం జాయతాం హర

యత్ర యత్ర త్వియం యాతి యావత్సాగర గామినీ
తత్ర తత్ర త్వయా భావ్యం ఏషచాస్తు వరోఅపర:

యోజనానాం తూ పరితు దశయావచ్చ సంఖ్యయా
తదన్తర ప్రవిష్టానాం మహాపాతకి నామపి

తత్పితౄణాం చతేషాంవై స్నానాయాగచ్ఛతాం శివ
స్నానేనా పీతరే మర్త్యా ముక్తి భాజో భవన్తు వై

ఏకతస్సర్వ తీర్థాని స్వర్గమర్త్య రసాతలే
ఏషాతేభ్యో విశిష్టాతు ఆలంశంభో నమోస్తుతే.

తాత్పర్యము :
సూర్యచంద్ర గ్రహణములలో, రెండు అయనములలో విషువమున(మేష,తులా సంక్రమణములు), సంక్రాంతి యందు, వైధృతి యందు ఇతర పుణ ్య తీర్థములలో స్నానమాచ రించినచో కలుగు పుణ ్యం గంగను స్మరించుట వలన మాత్రమే కలుగును. ఈ గంగా సముద్రం వరకు ప్రవహించు ప్రతీ చోట నీవు(శంకరుడు) ఉండవలెను. గంగానదికి 12 యోజనముల(96 కిమీ.) దూరంలో ఉన్న వారందరును మహాపాపకులైనను పుణ ్యం పొందవలయును. గంగలో స్నానం చేయుటకు వెళ్ళు వారికి, వారిని చూసినవారికి, వారి పితరులకు కూడా ముక్తి లభించువలయును. ఈ గంగానది సకల తీర్థముల కంటే విశిష్టముగా ఉండవల యును, ఇంత మాత్రం అనుగ్రహించిన చాలును శంభో నీకు నమస్కారము. అన్న గౌతముని విన్నపమునకు శంకరుడు సంతోషించి వరమును అనుగ్రహించెను.

శ్రీమాన్‌ డాక్ట ర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement