Friday, November 8, 2024

ధర్మం – మర్మం : పుణ్యతీర్థములు – దైవ తీర్థములు (ఆడియోతో…)

దైవ తీర్థముల గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

దైవ తీర్థములు :
బ్రహ్మపురాణం, గౌతమీ ఖండంలో నదీభేదాన్ని వివరిస్తూ దైవ తీర్థము గూర్చి వశిష్ఠాది మహర్షులకు బ్రహ్మదేవుడు ఈ విధంగా వివరించెను.
హిమాచల, వింధ్య పర్వతముల మధ్యన ఆరు దైవ తీర్థములు కలవు. అలాగే దక్షిణ సముద్ర వింధ్య పర్వతముల మధ్యన కూడా ఆరు దివ్యతీర్థములు కలవు. భారత వర్షంలో ఈ పన్నెండు నదులు ప్రధానమైనవి. ఈ నదుల వలనే భారతదేశం పుణ్యభూమిగా బహుపుణ ్య ఫలప్రదముగా పూజించబడుచున్నది. ఇది కర్మభూమి, పుణ్యములను వర్షించేది కావున భారత వర్షమును పుణ్యవర్షమని దేవతలు కీర్తించారు.

గోదావరీ, భీమరథీ, తుంగభద్రా, వేణికా, తాపీ, పయోష్ణీ ఈ ఆరు నదులు వింధ్యపర్వతమునకు దక్షిణ భాగమున కలవు. భాగీరథీ, నర్మదా, యమునా, సరస్వతీ, విశోకా, వితస్థా ఈ ఆరు నదులు హిమాలయ పర్వత ప్రాంతమున కలవు. ఈ పన్నెండు తీర్థములు అత్యంత పుణ్యనదులు కావున వీటిని దైవ తీర్థములుగా పేర్కొంటారు.

యశస్సు, ఫలము, ఐశ్వర్యము, కీర్తి లభించుటకు ఈ తీర్థములు నిర్మించబడినవి. ఎవరిచేత నిర్మించబడకుండానే తమకు తాముగా ఆవిర్భవించబడిన తీర్థములను ‘దైవ’ తీర్థములుగా పేర్కొంటారు. వీటిని పుణ్యతీర్థములుగా చెబుతారు. వీటినే ‘దేవఖాతములు’ అని కూడా అంటారు.

వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement