Monday, November 18, 2024

ధర్మం – మర్మం : యమ ద్వితీయ విశిష్టత మరియు అంతరార్థం (ఆడియోతో…)

యమ ద్వితీయ విశిష్టత మరియు అంతరార్థం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ..

కార్తీక శుద్ధ విదియను యమ ద్వితీయ అని అంటారు. ఆనాడు ‘భగినీ హస్త భోజనం’ అనగా ఎంతటి చక్రవర్తి అయిన ఆనాడు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె వండిన పదార్థాలను ఆమె చేత పెట్టించుకుని భుజించి ఆమెకు ధనకనక వస్తు వాహనాలను ఇచ్చి సత్కరించి ఆశీస్సులు అందించాలి.

యమునా నది తన అన్న అయిన యమధర్మరాజును పన్నెండేళ్ళ పాటు ప్రతి రోజు భోజనానికి ఆహ్వానిస్తే తాను నరకాన్ని విడిచివస్తే పాపులకు శిక్ష ఎవ్వరు వేయాలని సందేహించెను. సోదరి కోసం ఒక రోజు పాపులకు సెలవు ఇవ్వమని ప్రార్థించగా కార్తీక శుద్ధ విదియ నాడు యమధర్మరాజు యమున ఆహ్వానాన్ని మన్నించి వెళ్ళాడు. ఆమె సంతోషంతో ప్రేమతో వండిన పదార్థాలను ఆరగించిన యమధర్మరాజు ఆమెకు సకల సంపదలు కానుకగా ఇచ్చి వరం కోరుకోమనగా కార్తీక శుద్ధ విదియ నాడు సోదరి చేతి వంటను భుజించిన వారికి నరక లోక ప్రాప్తి కలగకుండా, సోదరుడికి ఆతిథ్యం ఇచ్చిన ఆడపడుచుకు సకల సంపదలు కలగాలని యమున కోరింది. సోదరి లేకున్నా బంధువులలో ఎవరినైనా సోదరిగా భావించాలి. ఈ విధంగా సోదర ప్రేమను, అనుబంధమును, ఆత్మీయతను పంచాలనేది ఈ పండగలోని పరమార్థం.

—శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement