Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు : ధర్మోపదేశము (ఆడియోతో…)

మహాభారతం, శాంతి పర్వంలోని ధర్మోపదేశము గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
ధర్మోపదేశము

అజ్ఞానాయహి యోజ్ఞానమ్‌ దధ్యాత్‌ ధర్మపదేశనమ్‌
కృత్స్నం వా పృధ్వీం దధ్యాత్‌ తేన తుల్యం న తత్ఫలం

జ్ఞానము లేని వారికి జ్ఞానమును ఇచ్చిన వాడు ధర్మము తెలి యని వానికి ధర్మమును ఉపదేశించిన వాడు పొందు ఫలము భూమండలమంతా దానం చేసిన వాడు కూడ పొందలేడు.

అనగా సకల భూమండలమును దానం చేసినా కలిగే ఫలం ధర్మమును జ్ఞానము ఉపదేశం చేసిన వారికి కలిగే ఫలంలో కోటి అంశం కూడ కాదు. ఎందుకన గా అధికంగా భూమిని దానం చేస్తే అతను భూస్వామి అవుతాడు. భూఫలంతో ధనవంతుడవుతాడు. అపుడు అతనికి ధనమదంతో అహ ంకారం పెరిగిపోతుంది. ఉన్న దానితో తృప్తి పొం దక తన బలంతో ఇతరుల భూమిని ఆక్రమించి, ధనాన్ని అపహరిస్తారు. ఇలా అహంకార మమకారాలతో తాను చెడిపోతూ తన చుట్టూ ఉన్న వారిని భ్రష్టులను చేస్తాడు. అదే జ్ఞానాన్ని, ధర్మాన్ని ఉపదేశిస్తే దాని వల్ల జ్ఞానము కలవాడు ధర్మము తెలిసిన వాడవుతాడు. గురువుల దయ వలన తాను పొందిన జ్ఞానాన్ని, తెలుసుకున్న ధర్మాన్ని పదిమందికి అందించి జ్ఞానులను, ధర్మాత్ములను చేస్తాడు. భూస్వామి అపహరిస్తాడు. ధర్మస్వామి అర్పిస్తాడు కావున ఎంత భూమిని దానం చేసినా జ్ఞానదానంతో సమానం కాదు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement