Wednesday, November 13, 2024

ధర్మం – మర్మం : కార్తిక మాసమున శ్రీహరిని పూజించు విధానము (ఆడియోతో…)

కార్తిక మాసమున శ్రీహరిని పూజించు విధానము గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

కార్తిక మాసమున కమలాప్రియుడు శ్రీహరిని కమలములతో పూజించిన మహా పుణ్యము దక్కుతుంది. కార్తిక మాసమున తులసీ దళమును శ్రీమహావిష్ణువునకు అర్పించిన వారు సంసారము నుండి విముక్తులై శ్రీహరి పరమపదమును చేరెదెరు. అలాగే కార్తిక మాసమున మొగలి పుష్పములను గరుడధ్వజుని(శ్రీమహావిష్ణువు)కి అర్చించిన వేయిజన్మలు పూజించిన ఫలం కలుగును. విష్ణుప్రియమైన కార్తిక మాసమున గీతా పఠనము చేసి శ్రీమద్భాగవతమును విన్నవారు సర్వపాప విముక్తులగుదురు.

—శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement