Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : బాలాత్రిపుర సుందరి (ఆడియోతో…)

బాలాత్రిపురసుందరీ అవతారంలోని అంతరార్థం – పరమార్థం గురించి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

బాలాత్రిపుర సుందరి :
బ్రహ్మకపాలము, లలాటము, వక్షస్థలము, మూడు పురములు కాగా వాటిలో ఉండి మన దు:ఖాన్ని పోగొట్టి మనకు ఆనందాన్ని ప్రసాదించే తల్లి ‘బాలాత్రిపుర సుందరి’. భూలోకము, భువర్లోకము, సువర్లోకము అను మూడు లోకాలను అధివసించి సకల జగత్తును రక్షించేది త్రిపుర సుందరీ. మోదము, ప్రమోదము,ఆనందము అనునవి మూడు పురములు. భూ:, భువ:, సువ: అను మూడు వ్యాహృతులు అలాగే సత ్త్వము, రజస్సు, తమస్సు మూడు పురములు, మూడు గుణములు. అదేవిధంగా ఇచ్ఛా, జ్ఞానము, క్రియ ఇవి కూడా మూడు పురములు. వీటినే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని అంటారు. స్వార్థేచ్ఛ, పరార్ధేచ్ఛ, పరమార్థేచ్ఛ అనునవి మూడు విధాల ఇచ్ఛలు అలాగే స్వార్థ జ్ఞానము, పరార్థ జ్ఞానము, పరమార్థ జ్ఞానము ఇవి మూడు జ్ఞానములు. అలాగే స్వార్థ క్రియ, పరార్థ క్రియ, పరమార్థ క్రియ అనునవి మూడు క్రియలు. సొంత లాభం చూసుకుంటే స్వార్థం, పదిమంది కోసం చేసేది పరార్థం, భగవత్‌ప్రాప్తికి చేసేది పరమార్థం. ఆహారం, నిద్ర, వ్యవహారం అనునవి కూడా మూడు పురములు. సుందరి అంటే అందమైన అని నిజమైన అందం పదిమందికి ఆనం దం కలిగించాలి కావున సకల లోకాలకు ఆనందాన్ని అందించే తల్లిని బాలా త్రిపుర సుందరిగా వ్యవహరిస్తారు. ఈమెను ప్రాత:కాల సంధ్య, సాయంకాల సంధ్యలలో ఆరాధించాలి.

నై వేద్యం : దద్యోదనం, పరమాన్నం

— శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్య..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement