గంగా జలం మర్త్యలోకం చేరు విధానంలో భాగంగా గౌతమునికి వినాయకుడు సూచించిన పాపపరిహారం గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
చతుర్ముఖ బ్రహ్మ కమండలమున ఉన్న జలము అనగా గంగా ఇప్పుడు మహేశ్వరుని జటాజుటమున ఉన్నదని తెలుసుకున్నాము కావున నీవు వెంటనే తపస్సు చేసి లేదా నియమాన్ని ఆచరించి శివ జుటాజమున ఉన్న గంగను తీసుకుని వచ్చి ఆ జలముతో గోవుకి అభిషేకం చేసిన అది జీవించునని వినాయకుడు గౌతముడితో పలికెను. ఈ విధంగా చేయగలిగితే తామంతా ఆశ్రమముననే ఉంటాము అని పలికిన గణపతి పలుకులకు ప్రకృతి దేవతలు పులకించి పూల వర్షము కురిపించి జయ జయ నాదములను చేసిరి. తపస్సుతో అగ్నిదేవుని, బ్రహ్మదేవుడిని, మహేశ్వరుడి మరియు దేవతల అనుగ్రహంతో మీ అందరి దయతో తన సంకల్పం సిద్ధించుగాక అని గౌతముడు వి నయముతో చేతులు జోడించి అక్కడి ఋషులతో పలుకగా వారు తధాస్తు అనిరి. ఋషులందరూ ఆశ్రమమున ఉన్న తమ నివాస స్థలములకేగిన పిమ్మట చేయదలచిన పనిని సంపూర్ణముగా చేయగలిగినందుకు సంతోషించి గణపతి, కుమారస్వామి జయ తిరిగి వెళ్ళిరి.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి