Wednesday, November 13, 2024

ధర్మం – మర్మం :

గంగా జలం మర్త్యలోకం చేరు విధానంలో భాగంగా గౌతముడు శంకరుడిని స్తుతించు విధానం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ఆత్మ ఐక్యమును, ఆత్మ ప్రకృతిని ఇదంతా నీ సంపద అని నీవు తలచినా ప్రకృతి నీ కంటే వేరుగా అయ్యి మమ్ములను మోహింప చేయుచున్నది. కావున నీ ప్రభావము ఊహించజాలనిది, ఆలోచించజాలనిది. అనంత విశ్వమూర్తివి, ప్రతి జన్మకు కారణము, స్థ్థితి నీవే. శివ, శక్తి, నిత్య, సర్వ సులక్షణ, సర్వ విలక్షణ అయిన నీ శక్తే సకల జగత్తును సృష్టించెను. సృష్టించుట, నిలుపుట, పోషించుట, లయము ఇవన్నీ నీవే. సత్పురుషులకు నీవే సనాతనమైన అర్థము. ఈ సకల జగత్తు మరియు భూమి నీవి. ఈ భూమే నీవు సృష్టించిన ప్రాణులకు ప్రియమైనది. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ భూమి కోసమే జీవులు అన్నమును, ధనమును, దానము చేసి తపస్సులను, ధర్మములను ఆచరించెదరని గౌతముడు స్తుతించెను.

శ్రీమాన్‌ డాక్ట ర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement