Wednesday, November 20, 2024

ధర్మం – మర్మం :

గంగా జలం మర్త్యలోకం చేరు విధానంలో భాగంగా గౌతమ మహర్షి శంకరుని అష్టరూపములను స్తుతించు విధానం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

గౌతమ మహర్షి శంకరుని అష్టరూపములను స్తుతిస్తూ నీవు సకల జనులకు సోమ మూర్తివి అన్ని గుణములు కల అష్టమూర్తులను ధరించినవాడవు కావున మహాదేవుడిగా స్తోత్రం చేయబడుతున్నావు. సకల చరాచరములను భరించుచూ జగత్తు సంపత్తి మరియు వృద్ధి కొరకు మహీమయమైన రూపము నీది. సృష్టి, స్థితి, సంహారముల కొరకు భూమికి ఆధారముగా ఉండుటకు, జనుల సుఖమునకు, ధర్మమమునకు, ప్రతిష్ట కొరకు ఈ ఆపో(జలం) రూపమును ధరించి ఉన్నావు. కాలప్రతిష్టను, అమృత ప్రవాహమును, జీవస్థితిని, సృష్టిని, వినాశాన్ని, ప్రజలకు సంతోషాన్ని, సుఖాన్ని, ఉన్నతిని కలిగించుటకు సూర్య, చంద్ర, అగ్ని రూపములను ధరించి ఉన్నావు. భేదము లేకుండా ప్రయత్నము లేదు, ధర్మము లేదు ఇతరమైన ఆత్మీయము లేదు. దిక్కులు, అంతరిక్షములు, భూమి-ఆకాశములు, భుక్తి ముక్తులు లేవు. వీటన్నింటిని ఏర్పరుచటకు, నిలుపుటకు ఆధారం నీ ఆకాశ రూపం అని పలు రకాలుగా గౌతముడు పరమేశ్వరుడిని స్తుతించెను.

Advertisement

తాజా వార్తలు

Advertisement