గంగా జలం మర్త్యలోకం చేరు విధానంలో భాగంగా గౌతమునికి కలిగిన పుణ్యం గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి
వివరణ…
మునిశ్రేష్ఠుడయిన గౌతముడు తన తపస్సుతో కల్మషమును తొలగించుకొని జరిగిన సంఘటనను తలచుకొనెను. తాను చేసిన తప్పేమిటని ఎందుకు ఇలా జరిగినదని పరిప రి విధములుగా ఆలోచించి తన దివ్య జ్ఞానంతో జరిగిన దానిని తెలుసుకొనెను. దేవతలు తమ కార్యం నెరవేర్చుకొనుటకు తనకు పాపాన్ని కలిగించారని గౌతముడు తెలుసుకున్నా దీని వల్ల లోకోపకారం జరుగుతున్నదని గంగా జలంతో భూమి, భూలోకవాసులు పవిత్రులవుతారని, పార్వతిదేవికి సపత్నీ పీడ తొలుగుతుందని, శంకురుడు సంతోషిస్తాడని గుర్తించి ఆనందించెను. ఇంతటి మహా భాగ్యం కలిగినందుకు ఇది పాపం కాదు పుణ్యమేనని తెలుసుకొన్న గౌతమ మహర్షి పరమానందమును పొందెను.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి