Friday, November 22, 2024

ధర్మం – మర్మం :

గంగా జలం మర్త్యలోకం చేరు విధానంలో భాగంగా గౌతముడు గంగను స్తుతించు విధానం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

గంగే వాగీశ్వరీ, లోక గురువైన శివునికి ప్రియురాలు. ఈ గంగ చతుర్ముఖుడైన బ్రహ్మ మనస్సులోని మలినాన్ని శుద్ధి చేసినది కావున గంగను మనసులో చింతిస్తే సకల పాపాలు తొలగుతాయన్నది నిర్వివాదాంశం. పరమ శివుడు జగత్తును పావనం చేయడానికి వివిధ ఉపాయములతో గంగను ఆవిర్భవింపజేసెను. సకల వేదములు శంకరుని ప్రభుతను వేనోళ్ల కీర్తించాయి. అదేవిధంగా స దా శివుని విభూతి అయిన ఈ గంగ ధర్మ విభాగము ధర్మ ప్రచారము చేసి ధర్మములను ఆచరింపజేసి అనుభవించినది. ఈ గంగే వైదికములు, లౌకికములు అయిన కార్య, క్రియ, కారకసాధనములకు అత్యుత్తమమైన సాధ్యము, ప్రియము కూడా. ఈ గంగ అనాది కర్త అయిన పరమేశ్వరునికి సిద్ధి. పరబ్రహ్మన, పర ప్రదానమునకు సార భూతమును ఉపాసించి ముక్తిని పొందిన వారు మళ్ళీ పుట్టరు. శంకరుడు ఆయా సందర్భాలలో ధరించిన ఆయా రూపాలను జగత్‌ హితము కొరకు ఆ అవతారమునకు తగినట్లుగా గంగా కూడా రూపాలను ధరించి పతివ్రతాత్వమును సార్ధకము చేసుకొనుచున్నది. ఈవిధంగా శివ పార్వతులను గంగను గౌతమ మహర్షి స్తుతించెను.

శ్రీమాన్‌ డాక్ట ర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement