Tuesday, November 26, 2024

ధర్మమే రక్షణ కవచం!

ధర్మాన్ని రక్షిస్తే ధర్మం రక్షిస్తుందని ఆర్యోక్తి. భాగవతాన్ని సూతమహా ముని శౌనికాదులకు చెబుతూ ఈశ్వరుడు 21 అవతారాలను వివరించా రు. శ్రీకృష్ణావతార ప్రాశస్త్యం చెబుతూ, మహా భారతంలోని ఉదాహరణ ను వివరించారు. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. భీముని గదాఘాతంతో దుర్యోధనుడు తొడలు విరిగి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. అతను చనిపోయే లోపు శాంతి కలిగించే వార్త చెప్పాలని అశ్వద్ధామ తల చాడు. అంతట గాఢ నిద్రలో ఉన్న ఉపపాండవుల కుత్తుకలు కోసి పాండ వులకు వారసుడు లేకుండా చేసాడు. యుద్ధంలో అభిమన్యుడు మరణిం చాడు కనుక ఇక పాండవుల వారసులు లేరనే శుభవార్తను దుర్యోధనుడికి చేరవేసి సంతృప్తిగా ప్రాణం విడిచేలా చేసాడు. తెల్లవారింది. ఉప పాండ వుల ఊచకోత వార్త పాండవుల శిబిరాల్లో విషాదం నింపింది. ద్రౌపతి భోరుభోరున ఏడుస్తున్నది. పిల్లల హంతకుడిని తాను తీసుకువస్తానని అతడ్ని నీ ఇష్టం వచ్చిన రీతిలో శిక్షించమని ద్రౌపదికి అర్జునుడు చెప్పా డు. ఈ దారుణం చేసినది ఎవరనేది ఊ#హంచిన అర్జునుడు శ్రీకృష్ణ పర మాత్మను తీసుకుని రథంపై వెళ్లి అశ్వద్ధామ ను పట్టుకున్నాడు. అంత తనను రక్షించుకోవడానికి అశ్వద్ధామ ఉపసంహరణ తెలియక పోయినా బ్రహ్మాస్త్రం వేసాడు. శ్రీకృష్ణుడు అర్జునుని కూడా వేయమన్నాడు. అంత అర్జును డు వేసాడు. అశ్వద్ధామ వేసిన అస్త్రాన్ని సవ్యసాచి వేసిన అ స్త్రం నిలువరించింది. విశ్వం నాశనం కాకుండా ఆగింది. అప్పుడు రెంటినీ ఉపసంహరించాలని అర్జునుని పరమాత్మ ఆదేశించాడు. రెం డింటిని ఉపసంహరించాడు. వెంటనే అశ్వద్ధామను పట్టుకుని రథానికి కట్టా డు. అంత శ్రీకృష్ణుడు ఈ దుర్మార్గుడి ని వధించమన్నాడు. బ్రాహ్మణుడై నా ఆకతాయి తనంతో పిల్లలను చం పినవాడు శిక్షార్హుడే అన్నాడు.కాని అతడ్ని చంపక రథానికి కట్టి ఈడ్చు కుంటూ ద్రౌపది వద్దకు తీసుకువెళ్లా డు. భీముడు అశ్వద్ధామను వధిస్తా నని ముందుకురాగా ద్రౌపతి వారిం చింది. అతడు గురు పుత్రుడు. అతన్ని సంహరిస్తే అశ్వద్ధామ తల్లి తనలాగే బిడ్డ మరణించాడని విలపిస్తుంది. బిడ్డల మృతి వల్ల తల్లిపడే బాధ తనకు తెలుసని ఆ బాధ గురుపత్నికి రాకూడదని వదిలేసింది. అంత అర్జునుడు అశ్వత్థామకు శిరోముండనం చేసి, పుట్టుకతో శిరస్సుపై వచ్చిన మణిని తొలగించి వదిలి వేసాడు. స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పినా అశ్వద్ధామను చంపకుండా వదిలి వేసాడు. శ్రీకృష్ణుడి మాట జవదాటని సవ్యసాచి ఈ విషయంలో ఎందుకు పాటించలేదని సందేహం వస్తుంది. వాడు ఎంతటి పాపం చేసినా గురు పుత్రుడు, బ్రాహ్మణుడిని సంహరించడం ధర్మం కాదని అర్జునుడు వదిలి వేసాడు. వారు పాటిం చిన ధర్మమే వంశాకురం బతికి బట్టకట్టడానికి దోహదపడింది. అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో వంశాకురం ఉందని తెలుసుకున్న అశ్వద్ధామ శిరోముండనం తరువాత బయ టకు వచ్చి మరోసారి బ్రహ్మాస్త్రం ఆ పిండం పై ప్రయోగిం చాడు. శిశువును చిదమడానికి బ్రహ్మాస్త్రం ఉత్తర గర్భం లోకి ప్రవేశించింది. ఆ బాధను ఆమె భరించలేకున్నది. ఆమె తనను, తన గర్భస్థ శిశువును రక్షించమని శ్రీకృష్ణుని శరణు వేడింది. అరివీర భయంకరులైన ఐదుగురు మామలను కాక పరమాత్మను శరణు కోరింది. స్వామి.. నీ మేనల్లుడి వంశాకురాన్ని రక్షించమని వేడుకుంది.
కరుణామయుడైన శ్రీకృష్ణుడు ఉత్తర ప్రార్ధనకు కరిగి ఆమె గర్భం లో సూక్ష్మరూపంలో శంకచక్రగదాధారుడై ప్రవేశించి, శిశువును వేధిస్తున్న శక్తిని దునుమాడి శిశువును కాపాడాడు. ద్రౌపతి, అర్జు నుడు గురుపుత్రుని చంపక ధర్మాన్ని అనుసరించడం వల్ల పరమా త్మ శ్రీకృష్ణుడు వారి వంశాకు రా న్ని రక్షించి ధర్మాన్ని నిలబెట్టారు. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం త ప్పక రక్షిస్తుందనేది ఇక్కడ రు జువైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement