Tuesday, November 26, 2024

”ధర్మ బద్ధ జీవితం గడుపుదాం”

సనాతన ధర్మమంటూ ఒకటున్నది. దాన్ని ఎంతగా రక్షించుకోగలిగితే, అంతగా అది మన క్షేమం చూస్తుంది. ‘ధర్మం’ అనేది మన జాతికి ప్రాణం. అది లేని జాతి నిర్జీవం. అది లేని ఖ్యాతీ వ్యర్థం. కీర్తికేం.. ఎలాగైనా సంపాదించవచ్చు. డబ్బుతో, పదవితో, పెడదారితో… ఇలా ఎన్నో మార్గాలున్నాయి. మన కృషితో, చిత్తశు ద్ధితో, ప్రతిఫలాపేక్ష లేకుండా వచ్చే కీర్తే నిజమైనది, శాశ్వతమైనది. అందుకుగాను ధర్మబద్ధమైన జీవితం గడపాలి. బతకడం కష్ట మేమీ కాదు. ‘ఎలా బతుకుతున్నాం, ఎందుకు బతుకుతున్నాం’ అన్న ప్రశ్నలకే ప్రాధాన్యం ఇవ్వాలి. సాటి మనిషికి నమస్కరించడం మనకు సంప్రదాయం నేర్పింది. అతడిలో మంచి ఉంటే ఆ మంచిని ఆహ్వానిస్తూ నమస్కరిస్తాం. చెడు ఉంటే నా జోలికి రావద్దు అని నమస్కారం చేస్తాం. చెడునే దూరం చేసుకోవాలి కాని, ఆ చెడు ఉన్న మనిషిని ద్వేషించవలసిన పనిలేదు. సత్యం బతకడం నేర్పుతుంది. ప్రేమ బతికించడం నేర్పుతుంది. వీటిని తన ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా చేసుకున్నప్పుడు మానవ జీవనయాత్ర ఆదర్శ వంతంగా సాగి చరిత్ర సృష్టించగలుగుతుంది. సత్యనిష్ఠ కలిగినవాడు ఏ వృత్తిలో ఉన్నా శాశ్వత కీర్తిని సొంతం చేసుకోగలుగుతాడు. సత్యాన్ని మించిన సంపద లేదు. మనిషిని సంస్కారిగా తీర్చిదిద్దేది సత్యమే! ప్రేమను పంచే వాడికే ప్రేమను పొందే అర్హత కలుగు తుంది. అందుకే ఇచ్చి పుచ్చుకోవాలంటారు. ప్రేమే పరమాత్మ అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. మంచి ప్రేమికులను, మంచి స్నే#హతులను పొందగలగడమంత అదృష్టం మరొకటి లేదు. ప్రేమను, స్నేహాన్ని పూర్తిగా అవగా#హన చేసుకునేవారినే ఆ అదృష్టం వరిస్తుంది. కేవలం తనవారినే తన బంధువుల్నే ప్రేమించడం ప్రేమ కాదు. ‘ప్రపంచమంతా ఒకటే’ అన్న సత్యాన్ని అవగా#హన చేసు కోగలిగేవాడే అసలైన ప్రేమికుడు. ప్రపంచానికే పుత్రుడిగా మానవుణ్ని అభివర్ణించింది వేదం. ఎన్ని శాస్త్రాలు చదివినా ‘ప్రేమ’ గురించి తెలుసుకోలేనివాడు పండితుడే కాదు అన్నాడు కబీర్‌దాసు. విశ్వ#హతాన్నే ప్రతి మనిషి కోరుకోవాలి అని తపోధనులు ఏనాడో చెప్పారు. అ#హంస, ఆస్తేయం (దొంగిలించకపోవడం), సత్యం, బ్ర#హ్మచర్యం, అపరిగ్ర#హం అనే అయిదు వ్రతాలను మని షి తన నిత్యకృత్యాల్లో భాగంగానే భావించాలని పతంజలి యోగశాస్త్రం స్పష్టంచేసింది. ఒంటరిగా తినరాదని, అతిథితో పంచుకొని తినడం నిత్యకృత్యంగా చేసుకోవాలని రుగ్వేదం చెబుతుంది. త్రికరణశుద్ధి అనేది జీవితంతో సర్వదా ముడివడిపోవాలి. మనిషి నిరంతర విద్యార్థి, నిరంతర జానార్థి. నిరంతర సాధనార్థి. ఇది గ్ర#హంచకుండా చేసే నిత్యకృత్యాలన్నీ వ్యర్థం. జీవించడం #హక్కు అయితే, జీవించనివ్వడం పరమవిధి! అప్పుడే జీవితానికి అర్థం, పరమార్థం.

Advertisement

తాజా వార్తలు

Advertisement