పూ ర్ణయోగ సాధకులు ధనం పట్ల ఏ వైఖరి అవలంబించాల్సింది శ్రీ అరవిందులు చాలా విషయాలు చెప్పారు.
ధనం అనేది ఒక విశ్వశక్తికి ప్రతీక. ఈ జీవితం నిండుగా, ఏ వెలితీ లేకుండా సాగిపోవాలంటే ధనం చాలా అవసరం. మౌలికంగా చూసినపుడు ఈ శక్తి దైవానికి చెందినదే. మనం అజ్ఞానంలో కూ రుకుపోయి వున్నపుడు అహంకారం దానిని తన అవసరాల కోసం ఆ విధంగా స్వాధీనపరచుకు నేందుకు ప్రయత్నిస్తుంది. అసురిక ప్రవృత్తి దానిని చేజిక్కించుకొని తన ప్రయోజనం కోసం అప మా ర్గాలలో వినియోగిస్తుంది. ఈ ప్రపంచం మీద తమ ఆధిపత్యం చలాయించాలని చూసే మూడు శక్తుల లో అదీ ఒకటి. మిగిలినవి అధికారం, అలవి మా లిన కోరికలు, మానవుడు తన అహంకారాన్ని తృప్తిపరచుకునేందుకు ఈ మూడింటిని విచ్చల విడిగా వాడుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.
ధనాన్ని సంపాదించేవారు దానిని తమ స్వాధీ నంలో ఉంచుకునేందుకు బదులు దాని స్వాధీ నంలోకి తాము వెళతారు. అంటే ధన సంపాదన కోసం ఏమైనా చేస్తారు. అది ఎంతగా తమ వద్దకు చేరితే, అంతగా వారు అసుర ప్రవృత్తికి లోనవు తారు. ఇది మనం సర్వత్రా చూస్తున్నదే. దాని ప్రభా వం నుండి తప్పించుకోవడం అనుకున్నంత సుల భం కాదు. ఈ కారణంగానే ఆధ్యాత్మికంగా జీవిం చాలని అనుకున్న వారు, ఆత్మ సంయమనాన్ని ప్రపంచ వైరాగ్యాన్ని ఒత్తి చెబుతారు. అందుకే సమస్త సంపదలను పరిత్యజించాలి అని చెప్పారు. అస్సలు సంపద కావాలనే కోరికను సమూలంగా మనసు నుండి పెరికి పారేయాలని అంటారు. మరి కొన్ని సాధనా మార్గాలైతే ధనాన్ని ఏమాత్రం దగ్గ రకు రానీయకుండా దారిద్య్రం, భిక్షాటనలే ఆధ్యా త్మిక సాధకులకు నియమంగా చెప్తాయి.
ఇదొక పొరపాటు
”కాని ఇది ఒక పొరపాటు. ఈ నియామాల వలన ఈ ధనశక్తి అసుర శక్తుల చేతిలో బందీగా మారిపోయే అవకాశం ఇచ్చినట్లవుతుంది. ధనం భగవంతుని శక్తి గనుక, ఆ ధనం భగవంతుని నిమిత్తమే ఉపయోగపడాలి గనుక, దీనిని వీలైనం తగా ధర్మ మార్గంలో సంపాదించి, ఈ భూమి మీద దివ్యజీవన స్థాపన కోసం, దివ్య మార్గంలో ఉపయోగించాలి”.
ఆసక్తి కూడదు
ధనశక్తి నుండి గానీ, అది సమకూర్చే సాధనా లు, వస్తుకాలం నుండి సన్యాసికుండే సంకోచంతో వెనుదిరిగి పోగూడదు. అలా అని చెప్పి అవన్నీ తనకే కావాలనే ఆసక్తిని సైతం పెంచుకోకూడదు. మనల్ని తనకు దాసులను చేసే విషయ భోగాలను సైతం దగ్గరకు రానీయకూడదు.
సంపదంతా దైవానిదే
సంపద అంతా మౌలికంగా దైవానిదే కనుక ధనవంతులు ధర్మకర్తలే గానీ, యజమానులు కారు. ధనం ఈ రోజు ఒకచోట ఉంటుంది. రేపు మరొకచోట ఉంటుంది. కనుక ధనం తమ వద్ద ఉన్నపుడు ఏ ఉద్దేశ్యంతో ధనాన్ని ఖర్చు పెట్టారు.
మంచి ధర్మకర్త
”నీవు నీ కోసం ధనాన్ని ఉపయోగిస్తున్నపుడు ఏది నీ దగ్గర ఇపుడు వున్నదో, ఏది రేపు నీ వద్దకు రాబోతున్నదో లేదా స్వీకరిస్తున్నావో అది అంతా ఆ విశ్వమాతదే” అనేది మరవకూడదు. నీకు అధికా రం ఉన్నట్లు ఆమెనేదీ అడగకూడదు. అమె కేవ లం నీకు ఇచ్చిన దానినే స్వీకరించి, అది ఎందు కోసం నీ దగ్గరకు వచ్చిందో, దాని కోసమే దానిని వినియోగించు. సర్వకాలాలలోనూ నిస్వార్థంగా వుండు కర్తవ్య నిష్టలో నిమగ్నమై వుండు. మరొక మాటలో నీవొక మంచి ధర్మకర్తవు కావాలి. నీవు ఉపయోగిస్తున్న ధనాన్ని భక్తి పూర్వకంగా ఆమె పా దాల వద్ద పుష్పాలుగా సమర్పించు.
ఉభయత్రా సమత
”ధనం లేకుండా బీదవానిగా జీవించాల్సి వస్తే అలానూ జీవించాలి. తన వద్ద ధనం లేదనే ు|ౌ ఏ మాత్రం ఉండకూడదు. సంపన్నుడుగా జీవించా ల్సివస్తే అలానూ జీవించాలి. క్షణమాత్రం గూడా కోరికలోనికి జారిపోగూడదు. ధనం వల్ల ప్రాప్తించే ఏ భోగాలకూ లొంగిపోకూడదు.”
విశిష్ట సాధకులు
”అతి మానవ సృష్టి యందు ధనాన్ని తిరిగి దివ్యశక్తికీ సమర్పించాలి. ధనాన్ని సత్యమూ, సుం దరమూ, సామరస్య పూర్ణమూ అయిన విశిష్ట వస్తు సంపాదనకు ఉపయోగించాలి. ఎవరైతే అహంకారం నుండి విముక్తులై వుంటారో ఎవరైతే ఎట్టి కోరిక సంకోచము లేకుండా తమను తాము అర్పించుకుంటారో వారే దివ్యశక్తికి సరైన వా#హక లు అవుతారు. వారే ధనమును దివ్యశక్తి కొరకు సం పాదించే సమర్థులు అవుతారు. ధనం పట్ల ఈవిధ మైన భావనతో పూర్ణయోగ సాధకులు జీవించా లన్నది శ్రీ అరవిందుల దివ్య సందేశం.