Monday, November 25, 2024

దానాలు… ఆచరణ… నియమాలు

హిందూ అచారా సాంప్రదాయాల్లో దాన ధర్మాలు చేయటం అన్నది పూర్వకాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. మోక్ష సాధన కోసం ఒక్కోక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. తనకున్న దానిలో కొంత బాగాన్ని లేని వారికి దానం చేస్తే పుణ్యం దక్కు తుందని భావిస్తారు. దాన ధర్మాలకు సంబంధించి అనేక రకాలు ఉన్నాయి. అన్నదానం, వస్త్రదానం, జలదానం, గోదానం, కన్యాదానం, సువర్ణదానం, భూదానం మొదలైనవి దానాల్లో కెల్ల విశిష్టమైనవి.
అయితే దానధర్మాలు చేయడానికి కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా సూర్యస్తమయం తరువాత అస్సలు దానం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే చాలా ధనం నష్టపోతారు. చాలా మంది రాత్రివేళలో పేదలకు, పొరుగువారికి పెరుగును దానం చేస్తూ ఉంటారు. అలా చేయటం ఏమాత్రం సరికాదు. సూర్యాస్తమయం తరువాత ఎట్టి పరిస్ధితుల్లో పెరుగును దానంగా ఇవ్వరాదు. పెరుగు శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. శుక్రుడు మనలో సంతోషాన్ని, శ్రేయస్సును పెంచేవాడు. చీకటి పడిన తర్వాత పెరుగును దానం చేస్తే కుటుంబ జీవితంలో సంతోషం తగ్గుతుంది.
సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరికీ అప్పులు ఇవ్వకూడదు. ముఖ్యంగా చీకటి పడిన తర్వాత ఎవరికైనా అప్పులు ఇస్తే ఆర్థిక సమస్యలతో సతమతమవుతారు. అలాగే రాత్రి సమ యంలో వంట చేసే సమయంలో పక్కింటి వారు ఎక్కువగా ఉల్లిపాయ, వెల్లుల్లిని అడుగు తుంటారు. అయితే ఎట్టి పరిస్ధితుల్లోనూ ఈ రెండింటిని ఇవ్వకూడదు. వీటిని అరువుగా ఇస్తే చెడు ఫలితాలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
పాలు దానం చేస్తే చాలా మంచిదని చెప్తుంటారు. అయితే సూర్యాస్తమయం తరువాత పాలను దానం చేయటం ఏమాత్రం మంచిది కాదు.పాలు.. చంద్రుడికి సంబంధించినది. పాలను దానం చేస్తే లక్ష్మీదేవికి , విష్ణమూర్తికి కోపం వస్తుంది. చీకటి పడ్డాక ముఖ్యంగా ఉప్పును మాత్రం ఎవరికి ఇవ్వకూడదు. ఈ ఆచారం మన పెద్దలు ఏప్పటి నుండో పాటిస్తున్నారు. ఉప్పులో లక్ష్మీదేవి ఉంటుంది. ఉప్పును దానంగా ఇవ్వటం వల్ల లక్ష్మీదేవిని ఇంటి నుండి వేరే వారి ఇంటికి వెళ్ళగొట్టినట్టే అవుతుంది. దుకాణ దారులు చాలా మంది చీకటి పడితే ఉప్పును విక్రయించని ఆనవాయితీనీ నేటికి అక్కడక్కడ కొనసాగిస్తున్నారు.
సాయంత్రం సమయంలో తులసి చెట్టును అస్సలు తాకకూడదు. ఒకవేళ ఇలా చేస్తే లేని పోని సమస్యలను కొని తెచ్చుకున్నవారవుతారు. భార్యభర్తలు సంధ్యాసమయంలో కలవకుండా బ్రహ్మచర్య నియమాలను పాటించాలి. ఒకవేళ ఈ సమయంలో కలిసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశ ముంది. ఆ సమయంలో సంబంధం వల్ల పుట్టిన పిల్లలు అవలక్షణాలు కలిగి ఉంటారు. సూర్యాస్తమయ సమయంలో పిల్లలు చదవకూడదు. ఇలా చేయటం వల్ల విద్యార్థుల మేధస్సు క్షీణించటంతోపాటు మహాలక్ష్మీ, సరస్వతి దేవి ఇద్దరూ దూరమయ్యే అవకాశం కలదు.
ఏదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వ డం. ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ,వస్తు సహాయ మును కానీ..’ధర్మం’ అంటారు. ‘ధర్మం’ చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇ#హలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది.
‘ధర్మం’ చెయ్యడానికి పరిధులు లేవు. నీకు తోచినది ఏదైనా ధర్మం చెయ్యవచ్చు. కానీ, ‘దానం’ చెయ్యడానికి కొన్ని పరిధులు ఉన్నాయి. ఏదిపడితే అది దానం చెయ్య డానికి వీలులేదు. అలాచేయడానికి మీరు సిద్ధంగాఉన్నా., తీసుకోవడానికి విప్రులు సిద్ధంగా ఉండరు. శాస్త్రనియమా నుసారం దానయోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటినే దానం చెయ్యాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు. ఇవి మొత్తం పది దానాలు.
గో భూ తిల హరణ్య ఆజ్య వాసౌ ధాన్య గుడానిచ రౌప్యం లవణ మిత్యా#హుర్దశదానా: ప్రకీర్తితా:
దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగా రము, ఆవునెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు…ఈ పదింటిని దశ దానములుగా శాస్త్రం నిర్ణయిం చింది. వీటినే మంత్రపూర్వకంగా దానం చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. మరి, ఏ ఏ దానంవల్ల ఏ ఏ ఫలం వస్తుందో తెలుసుకోవాలి కదా..
గోదానం .. గోవు అంగములందు పదునాలుగు లోకా లు ఉన్నాయి. బాగా పాలు ఇచ్చేది, మంచి వయసులో నున్నది, దూడతో కూడుకున్నది అయిన ఆవును బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురము, రాగి తోక, నూతన వస్త్రములతో అలంకరించి, ఆ ఆవుతోపాటు పాలు పితుక్కునే పాత్రను ఇస్తూ, ఫల, దక్షిణ, తాంబూలములతో యథావథిగి దానం చెయ్యాలి. గోవుకు కనీసం ఆరు నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి. ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై, దాతకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు.??
భూదానం.. కృతయుగంలో #హరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతూంటే.. శ్రీహరి వరాహావతారం ధరించి, ఆ భూమిని తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరిం చాడు. సుక్షేత్రము, సమస్త సస్యసమృద్ధము అయిన భూమిని దానం చేయుటచేత అనంత పుణ్యఫలం లభిస్తుం ది. ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై, దాతకు శివలోక ప్రాప్తిని అనుగ్రహస్తాడు.
తిలదానం .. తిలలు అంటే నువ్వులు. శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చెయ్యడంవలన సమస్త పాపములు నశిస్తాయి.ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై., దాతకు విష్ణులోకప్రాప్తిని అనుగ్రహస్తాడు.
హరణ్య (సువర్ణ)దానం . హరణ్యము అంటే బంగారం. బ్రహ్మదేవుని గర్భం నుండి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వలన, దాత సమస్త కర్మల నుంచి విముక్తుడు అవు తాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై. దాతకు అగ్నిలోకప్రాప్తిని అనుగ్ర#హస్తాడు.
ఆజ్య(నెయ్యి)దానం ..ఆజ్యము అంటే ఆవునెయ్యి. ఈ నెయ్యి కామధేనువు పాలనుండి ఉద్భవించింది. ఈ నెయ్యినే య్ఞ, యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అట్టి ఆజ్యాన్ని దానం చేయడం వలన సకల య్ఞఫలం లభి స్తుంది.ఈ దానంతో మహంద్రుడు సంప్రీతుడై దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహస్తాడు.
వస్త్రదానం.. శీతోష్ణములనుండి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రము కేవలం అలంకా రానికే కాకుండా, మానాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వలన, సర్వ దేవతలు సంతోషించి,సకల శుభాలు కలుగాలని దాతను దీవిస్తారు.
ధాన్యదానం.. జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యము. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణము. అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయుట వలన, సకల దిక్పాలకులు సంతృప్తిచెంది, దాత కు ఇ#హలోకమందు సకలసౌఖ్యము అనుగ్రహంచి, పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహస్తారు.
గుడ(బెల్లం)దానం .. రుచులలో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకురసం నుండి పుట్టింది. ఈ బెల్లం అంటే వినాయకునకు, శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టం. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు సంప్రీతులై., దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహ స్తారు.
రజత(వెండి)దానం.. అగ్నిదేవుని కన్నీటి నుండి ఉత్పన్నమైనది ఈ వెండి.ఈ దానంతో శివ, కేశవులు., పితృదేవతలు సంప్రీతులై., దాతకు సర్వసంపదలను, వంశాభివృద్ధిని అనుగ్రహస్తారు.
లవణ(ఉప్పు)దానం .. రుచులలో ఉత్తమమైనది ఉప్పు. ఈ దానంతో మత్యుదేవత సంప్రీతుడై., దాతకు ఆయుర్దాయమును, బలాన్ని, ఆనందాన్ని అనుగ్ర#హస్తాడు..
అలాగే బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలగుతాయి. పండ్లను దానంచేస్తే బుద్ధి, సిద్ధి కలుగుతాయి. పెరుగును దానం చేస్తే…….ఇంద్రియ నిగ్ర#హం కలుగుతుంది. నెయ్యి దానం చేస్తే……రోగాలు పోతాయి..ఆరోగ్యంగా ఉంటారు. పాలు దానం చేస్తే……నిద్రలేమి ఉండదు. తేనెను దానం చేస్తే……సంతానం కలుగుతుంది. ఉసిరికాయలు దానం చేస్తే…. మతిమరుపు తగ్గి జ్ణాపక శక్తి పెరుగుతుంది. టెంకాయ దానం చేస్తే……అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. దీపాలు దానం చేస్తే……కంటిచూపు మెరుగుపడుతుంది. గోదానం చేస్తే…… ఋణ విముక్తులౌతారు.ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.
– కైలాస్‌ నాగేష్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement